జైలులో ఏళ్లకు ఏళ్లు శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకోంది.ఖైదీలకు ఆర్థిక సాయాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
న్యాయస్థానం విధించిన జరిమానాలు, బెయిల్ ఫీజులను కట్టలేని పేద ఖైదీల కోసం ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని కేంద్ర హోంశాఖ తెలిపింది.జరిమానాలు కట్టలేక ఎంతోమంది జైళ్లలోనే మగ్గిపోతున్నారని, అటువంటి వారికి ఈ స్కీమ్ ఉపయోగ పడుతుందని వెల్లడించారు.
ఇందుకు గానూ ఈ-ప్రిజన్ ప్లాట్ ఫామ్ ను అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.







