తెలంగాణ ముఖ్యమంత్రి …టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.ఢిల్లీలోని మోదీ నివాసంలో ఆయనను సీఎం కేసీఆర్ కలుసుకున్నారు.
కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి.ఈ సందర్భంగా సీఎం ప్రభుత్వ పథకాలను మోదీకి వివరించనున్నారు.
కాళేశ్వరానికి కేంద్ర సాయం, పెండింగ్ నిధులపై ప్రధాన చర్చ జరగనుంది.మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై మోడీతో కేసీఆర్ చర్చించనున్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రిపుల్ ఐటీ.తదితర అంశాలపై ప్రధానికి మరోసారి కేసీఆర్ లేఖలు అందజేయనున్నారు.ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో జాప్యంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రధానమంత్రితో భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
తాజా వార్తలు