కొత్తగా జీడి మామిడి పంట సాగు చేసే రైతులు పాటించాల్సిన మెళుకువలు..!

రెండు తెలుగు రాష్ట్రాలలో జీడి మామిడి సాగు ( Jeedi Mamidi Cultivation )విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరుగుతుంది.మంచి లాభాలు వస్తూ ఉండడంతో రైతులు ( Farmers )ఈ పంట సాగుపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

 Techniques To Be Followed By The Farmers Who Cultivate The New Cashew Mango Crop-TeluguStop.com

ఇకపోతే ఈ పంటపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు రైతులు సాగు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.కొత్తగా జీడి మామిడి పంట సాగు చేయాలి అనుకునే రైతులు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.

Telugu Agriculture, Farmers, Jeedi Mamidi, Seeds-Latest News - Telugu

జీడి మామిడి విత్తనాలను తల్లి మొక్క నుంచి పొందాల్సి ఉంటుంది.ఒత్తుగా కురచకొమ్మలు ఎక్కువగా ఉండే మొక్క నుండి విత్తనాలు ( Seeds )సేకరించాలి.ఆ మొక్క ఎక్కువ శాతం ఆడ పువ్వులను కలిగి ఉండాలి.మధ్యస్థ సైజు కలిగి అధిక దిగుబడి ఇచ్చే విధంగా ఉండాలి.ఈ లక్షణాలన్నీ ఉన్న మొక్కల నుంచి విత్తనాలను సేకరిస్తే మొక్కలు వివిధ రకాల వ్యాధులను తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తాయి.ప్రధాన పొలంలో నాటుకునే జీడి మొక్క వయసు సుమారుగా నాలుగు నెలలు ఉండి పది నుంచి 15 ఆకులు కలిగి ఉన్న మొక్కను పొలంలో నాటుకోవాలి.

గింజలు మొలకెత్తిన తర్వాత త్వరగా శక్తిని కోల్పోతాయి కాబట్టి అప్పుడే సేకరించిన గింజలను నాటుకోవాలి.గింజ పరిమాణం ఐదు నుండి 6 గ్రాముల బరువు ఉండే విత్తనాలను నాటుకోవాలి.


Telugu Agriculture, Farmers, Jeedi Mamidi, Seeds-Latest News - Telugu

నాటుకునే ముందు గింజలను రెండు రోజులపాటు నీటిలో నానబెట్టాలి.ఒక హెక్టారుకు రెండు కేజీల విత్తనాలు అవసరం.జీడిమామిడిని నేరుగా అయిన విత్తుకోవచ్చు లేదా నారు సేకరించి అయిన విత్తుకోవచ్చు.విత్తనాన్ని అయితే పాలిథిన్ సంచుల్లో పెట్టి విత్తాలి.నీరు అధికంగా పెడితే విత్తనం కూలిపోయే అవకాశం ఉంది.కాబట్టి బాగా ఎండ తగిలే స్థలాలలో మొక్కలు నాటాలి.30 రోజుల్లో గా మొలకలు వస్తాయి 50 రోజుల్లో గా మొక్కలను పొలంలో నాటుకోవాలి.తొలకరి వర్షాలు అయిపోయాక జులై లేదా ఆగస్టు నెలలో విత్తుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube