దివంగత నటుడు నందమూరి తారకరత్న( Taraka Ratna ), ఆయన భార్య అలేఖ్య రెడ్డి ల గురించి మనందరికీ తెలిసిందే.భర్త చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటూ తనకు తన పిల్లలకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అలేఖ్య రెడ్డి.
అప్పుడప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది.ఎక్కువ శాతం తన పిల్లలకు సంబంధించిన విషయాల గురించి తెలుపుతూ ఉంటుంది అలేఖ్య రెడ్డి.
అందులో భాగంగానే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక చక్కటి శుభవార్తను తెలిపింది.

అదేమిటంటే తాజాగా తన పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ వేడుక జరిగిందంటూ దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది అలేఖ్య రెడ్డి( Alekhya Reddy).కూతురు హాఫ్ శారీ ఫంక్షన్ చాలా ఘనంగా జరిపినట్టు తెలుస్తోంది.మొదట తండ్రి తారకత్న ఫోటోలను అందంగా డెకరేట్ చేసి నివాళులు అర్పించి కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
నిష్క( Nishka ) హాఫ్ సారీలో కుందనపు బొమ్మలా ఉంది.వేడుక కోసం ఎంతో అందంగా ముస్తాబైంది.నుదిటిన పాపిడి బొట్టు, మెడలో బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డానం, చెవులకు పెద్ద బుట్టలు, రెండు చేతులకు గాజులు ధరించింది.

క్రీమ్ కలర్ చీర మ్యాచింగ్ రవికలో నిష్క ఎంతో అందంగా కనిపిస్తోంది.ఒకప్పుడు నిష్క నీ ట్రోల్ చేసిన వారే ఈరోజు ఆమెను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.చాలా అందంగా ఉంది అందానికి దిష్టి తగులుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఈ కార్యక్రమంలో అలేఖ్య రెడ్డి తరుపు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అంతా పాల్గొన్నట్లు తెలుస్తోంది.వైసీపీ నేత విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy )సతీసమేతంగా పాల్గొని నిష్కని ఆశీర్వదించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నిష్మకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.







