నేటితరం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం చేత సోషల్ మీడియా( Social media )లో ఆటోమెటిగ్గానే ప్రాచుర్యం ఏర్పడింది.దాంతో గల్లీకొక సెలిబ్రిటీ అవతరిస్తున్నాడు.
అవును, ఇపుడు ఎవరికి నచ్చిన కళను వారు సోషల్ మీడియాలో ప్రదర్శించే అవకాశం ఉంది.కాబట్టి ఔత్సాహికులు తమకి నచ్చిన పనులను వీడియోల రూపంలో కంటెంట్ క్రియేట్ చేస్తూ, సోషల్ మీడియాలో బాగానే ప్రాచుర్యం సంపాదిస్తున్నారు.
ఈ క్రమంలోనే అనునిత్యం అనేక రకాల వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం మనం చూస్తూ ఉన్నాము.

అయితే అలా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కంటెంట్ ఒకసారి నవ్వుని తెప్పిస్తే, మరొకసారి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.మరికొంతమంది మాత్రం పాపులారిటీ వలలో చిక్కుకొని ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రవర్తిస్తుంటారు.ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు.
ఈ క్రమంలో ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.ఓ యువకుడు కత్తులపై చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు.

అవును, సదరు కత్తి మీద సాము అంటారు కదా.అదే మాదిరి వ్యవహరిస్తూ.అందరికీ షాక్ ఇచ్చాడు.ఓ యువకుడు నేలపై పాత టైరును పెట్టి, దాని మధ్యలో 2 ఇటుకలను ఏర్పాటు చేసి, దాని మద్యో ఓ కత్తిని పాతి పెట్టాడు.
ఆ తరువాత టైరుకు చుట్టూ చాలా కత్తులను పాతిపెట్టడం జరిగింది.చివరగా రెండు ఇటులపై రెండు కాళ్లను పెట్టి విన్యాసం చేసేందుకు రెడీ అయ్యాడు.ఆ తరువాత ఊపిరి బిగపట్టి ఒక్కసారిగా వెనక్కు పల్టీలు కొడతాడు.అయితే తిరిగి ఇటుకలపై నిలబడే సమయంలో ఇటుకపై ఉండాల్సిన కాలు.
పొరపాటున కత్తిపై పడుతుంది.దీంతో కత్తి షూ కింద బలంగా గుచ్చుకు పోతుంది.
దాంతో అతను నొప్పితో విలవిల్లాడిపోతాడు.అతడి వెనుకే ఉన్న తల్లి.
అతన్ని మందలిస్తూ ఉండడం ఇక్కడ గమనించవచ్చు.అయినా అతను వినిపించుకోకుండా ఈ ప్రమాదకర విన్యాసం చేశాడు.
దాంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.‘‘ఇతను ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు!’’.
అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదం!’’ అంటూ హెచ్చరిస్తున్నారు.







