అలనాటి నిర్మాత ‘చిన్నప్ప దేవర కథ’ ఇప్పటి తరం తప్పకుండా తెలుసుకోవాలి.దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) డిజిటల్ జంతువులను సినిమాలలో వాడి, అద్భుతాలు చేస్తే, ఆనాడే నిర్మాత చిన్నప్ప దేవర( Chinnappa Devar ) నిజమైన జంతువులు అయినటువంటి పాము, తేలు, పొట్టేలు, ఏనుగు, సింహం, పులి వంటి జంతువులను నిజంగానే వాడుతూ సినిమాలు చేసేవారు.
ఎందుకంటే ఆయనకి నిజమైన జంతువులనే( Real Animals ) హీరోలుగా పెట్టి సినిమాలను తీయడం అంటే మహా ఇష్టం.ఆయనికి జంతువులను మచ్చిక చేసుకోవటం, వాటితో కనెక్ట్ కావటం అనేది వెన్నతో పెట్టిన విద్యలాగా ఉండేది.
స్వతహాగా సుబ్రమణ్య స్వామికి భక్తుడు అయినటువంటి ఆయన సుమారు వంద సినిమాలను తెరకెక్కించాడు.అందులో దాదాపుగా 16 సినిమాలు MGR తోనే తీసారు.
ముఖ్యంగా కధల్ని ఎంచుకోవడంలో చిన్నప్ప సిధ్ధహస్తుడు అని చెప్పుకోవచ్చు.ప్రొడక్షన్ ప్లానింగులలో రామానాయుడు, నాగిరెడ్డి- చక్రపాణిల్లాగా చాలా ప్రొఫెషనల్ అని అతనికి పేరుండేది.“హాథీ మేరీ సాథీ”( Haathi Mere Saathi ) వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి, రాజేష్ ఖన్నాను మాస్ హీరోని చేసింది కూడా ఈ చిన్నప్ప దేవరే అని మనలో చాలామందికి తెలియదు.అప్పట్లో తెలుగులో వచ్చిన “పొట్టేలు పున్నమ్మ సినిమా”( Pottelu Punnamma ) ఈయన స్వీయ దర్శకత్వంలోనే వచ్చింది.1978లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు లేరు.ఒక బయలాజికల్ పొట్టేలు ఉంటుంది అంతే.
ముఖ్యంగా ఈతరంలో సినిమా ఫీల్డులోకి రావాలనుకునే ఔత్సాహిక దర్శకులు, కధకులు ఇలాంటి సినిమాలను అధ్యయనం చేసి తీరాల్సిందే.ఈ సినిమాలో మెచ్చుకోవలసింది పొట్టేలునే.ఓ మనిషి లాగా నటించి, వీర విహారం చేస్తుంది.ఈ సినిమాలో మురళీమోహన్ తన పరిధిలో తాను బాగా నటించగా, మోహన్ బాబు నక్కజిత్తుల విలనిజం బాగా రక్తి కట్టించాడు.
ఈ సినిమాలో మెప్పు పొందలసిన మరో వ్యక్తి పేరు ఆత్రేయ.ఈ సినిమాతో ఆత్రేయ అందమైన డైలాగులనే కాదు, పదునైన డైలాగులను కూడా వ్రాయగలనని నిరూపించుకున్నాడు.ఇక పాటలను కూడా ఆయనే వ్రాసారు.కె వి మహదేవన్ సంగీత దర్శకత్వం ఈ సినిమాకి మరో ప్లస్.
సినిమా దర్శకుడు చిన్నప్ప దేవర్ అల్లుడు “త్యాగరాజన్” కావడం చేత చిన్నప్ప ఈ సినిమాని తనకి నచ్చినట్టు మలుచుకున్నాడని చెబుతూ ఉంటారు.ఈతరంలో అందరూ చూడతగ్గ సినిమా ఇది.ఒకప్పుడు పిల్లలు ఇలాంటి సినిమాలను తెగ ఇష్టపడివాళ్ళు.నేటితరం కామిక్స్ కి అలవాటు పడి వీటిని చూడటం మానేసారు.
కానీ ఇలాంటివి స్వయంగా తల్లిదండ్రులే నేటి తరానికి చూడాలని ప్రోత్సహించాలి!
.