టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని( Mahendra Singh Dhoni ) గురించి యువతలో ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.క్రికెట్ క్రీడా ప్రపంచంలో ధోనీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రని వేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు.
టీం లీడర్ గా ధోని టీమిండియాకు ఎనలేని సేవలు చేసాడు.అందుకే ఇప్పటికీ ఆయనికి ఫాన్ ఫాలోయింగ్ పెరుగుతున్నారే తప్పితే ఏమాత్రం తగ్గడం లేదు.
అయితే క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పిన ధోనీ ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే ఆడతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే 2025 ఐపీఎల్‌లో( IPL 2025 ) ఆడతాడా లేదా అనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగా మిగిలిపోయింది.
ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఎంఎస్ ధోని ప్లేయర్‌గా ఫీల్డ్‌లో కనిపిస్తాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు కాబట్టి.

అసలు విషయంలోకి వెళితే, మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారడంతో జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఇందులో ధోని చాలా సింపుల్‌గా కనిపించాడు.ఇదేదో యాడ్ షూట్( Ad Shoot ) సమయంలో తీసినట్లుగా ఉందని కొందరు భావిస్తున్నారు.
అదే సమయంలో, అభిమానులు కూడా ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు.అవును, మహేంద్ర సింగ్ ధోనీ గోవాలో( Goa ) కనిపించిన వీడియో వైరల్ అవుతోంది.
వీడియో విషయానికొస్తే, ధోని వ్యానిటీ వ్యాన్‌లో నుంచి దిగి కారు వైపు నడిచి వెళ్లడం వీడియోలో గమనించవచ్చు.సదరు వీడియోలో ధోనీ వైట్ కలర్ దుస్తుల్లో కనిపిస్తున్నాడు.
దాంతో ఆ వీడియో చూసిన జనాలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక్కడపోతే, దాదాపు కొన్ని నెలల క్రితం, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీపై అన్ని రకాల ఆరోపణలు చేసిన సంగతి విదితమే.ధోనీ కారణంగా యువరాజ్ సింగ్ కెరీర్ ముగిసిందని తీవ్రమైన విమర్శలు గుప్పించాడు.అదే సమయంలో, హర్భజన్ సింగ్ కూడా మహేంద్ర సింగ్ ధోనీని సైగల ద్వారా చాలాసార్లు లక్ష్యంగా చేసుకున్న సంగతి జనాలు మర్చిపోరు.
ఇటీవల, టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ కూడా ధోనీపై తీవ్రమైన ఆరోపణలు చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది.ఎప్పుడైనా ఆత్మకథ రాసుకున్నా లేదా నా స్వంత పోడ్‌కాస్ట్ ప్రారంభించినా, ప్రతిదీ బహిరంగంగా చెబుతాను అంటూ బాంబ్ పేల్చాడు.
ఏదిఏమైనా, ఎలాంటి వివాదం చెలరేగినా… ధోని ‘మిస్టర్ కూల్’ అని మనం ఒప్పుకోక తప్పదు.ఇక ఆయన తన ఆట ద్వారా దేశానికి చేసిన సేవలు ఎనలేవిని.








