ఈ మధ్యకాలంలో పుష్ప 2( Pushpa 2) సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా డిసెంబర్ 6న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా గత కొద్ది రోజులుగా పుష్ప 2 కి సంబంధించిన అనేక రకాల వార్తలు ప్రశ్నలు, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా పుష్ప సీక్వెల్ కు అల్లు అర్జున్ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఈ వార్తపై ఎన్నో రకాల గాసిప్పులు కూడా వినిపించిన విషయం తెలిసిందే.కానీ ఒకటి మాత్రం వాస్తవం పుష్ప 2 సినిమా మీద బన్నీ మూడేళ్ల టైమ్ స్పెండ్ చేసారు.ఈ టైమ్ లో రెండు సినిమాలు ఈజీగా చేసేయవచ్చు.వంద వంద వంతున చూసుకున్నా, రెండు వందల కోట్లు అదాయం రావచ్చు.ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు రెమ్యూనరేషన్ ని తీసుకోవడం లేదట.కానీ సినిమాలో షేర్ తీసుకుంటున్నారట.
అది ఎలా అంటే టోటల్ సినిమా టర్నోవర్ లో 27 శాతం బన్నీకి ఇవ్వాలట.అంటే ఇప్పుడు పుష్ప 2 సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ టర్నోవర్ చేసింది.
అంటే
270 కోట్లు బన్నీ కి
ఇవ్వాల్సి వుంటుంది.సినిమా నిర్మాణానికి 500 కోట్ల వరకు ఖర్చు అయి వుంటుందని అంచనా.

ఖర్చులు, బన్నీ పార్ట్ పోగా మిగిలిన దాంట్లో దర్శకుడు సుకుమార్ ( Sukumar )కు కూడా షేర్ ఇవ్వాలి.అపై మిగిలినది నిర్మాతలకు లాభం అన్నమాట.ఈ సంగతి ఎలా వున్నా మూడేళ్లు శ్రమపడి ఒక సినిమా చేయడం మాత్రమే కాదు, పుష్ప 2 అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నందుకు బన్నీ కి వచ్చిన అదాయం 270 కోట్లు.మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.





 

