జ్యోతిర్లింగాల సందర్శనలో మంచు విష్ణు కన్నప్ప టీమ్... భారమంతా శివయ్యదేనా?

మంచు విష్ణు( Manchu Vishnu ) హీరోగా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప( Kannappa ).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Manchu Vishnu And Kannappa Movie Team Visit Kedarnath Details, Manchu Vishnu, Mo-TeluguStop.com

ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడం విశేషం.ఈ సినిమాకు మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ప్రీతి ముకుందన్‌ హీరోయిన్గా, ప్రభాస్,( Prabhas ) అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ అందరూ భాగం కాబోతున్నారు.ఇక ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) అవా ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Telugu Akshay Kumar, Jyotirlingas, Kannappa, Kedarnath, Manchu Vishnu, Manchuvis

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ టీజర్ 20మిలియన్ వ్యూస్ సాధించినట్లుగా చిత్ర బృందం అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు.ఇక ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం  జ్యోతిర్లింగాల సందర్శనకు వెళ్లారు.ఇందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Telugu Akshay Kumar, Jyotirlingas, Kannappa, Kedarnath, Manchu Vishnu, Manchuvis

12 జ్యోతిర్లింగాల ప్రయాణాన్ని ప్రారంభించాం.పవిత్ర క్షేత్రం కేదార్‌ నాథ్‌ను సందర్శించాం.కన్నప్ప సినిమా కోసం ప్రార్థించామని మంచు విష్ణు తెలిపారు.ఇక ఈ జ్యోతిర్లింగాల సందర్శనార్థంలో భాగంగా మోహన్ బాబు మంచు విష్ణుతో పాటు ఇతర చిత్ర బృందం కూడా ఉన్నారు.

ఇక ఈ సినిమా అధిక భాగం న్యూజిలాండ్ లోనే షూటింగ్ జరుపుకున్నట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు ఏంటి అనే విషయాల గురించి సరైన స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube