ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఏఎస్, ఐపీఎస్ ( IAS, IPS) కావడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.ఐపీఎస్ ఈషా సింగ్( IPS Isha Singh ) సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలవడంతో పాటు ఆకట్టుకుంటోంది.
ఈషా సింగ్ మాట్లాడుతూ మాది ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) అయినప్పటికీ నాన్న వైపీ సింగ్ మహారాష్ట్ర్ కేడర్ ఐపీఎస్ గా పని చేశారని వెల్లడించారు.నా చదువంతా ముంబైలోనే సాగిందని ఈషా సింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.
తాను మొదట నేషనల్ లా స్కూల్ లో న్యాయవిద్యను పూర్తి చేశానని బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశానని ఆమె అన్నారు.పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణించిన సమయంలో వాళ్ల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ వాదించి కేసు గెలవడం నా లైఫ్ లో మరిచిపోలేని అనుభూతి అని ఆమె తెలిపారు.
నాన్న ప్రభావం నాపై ఎక్కువగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ఈ రీజన్ వల్లే న్యాయవాదిగా కంటే ఐపీఎస్ గా ప్రజలకు మరింత ఎక్కువ సేవలు చేయగలనని భావించానని ఈషా సింగ్ కామెంట్లు చేశారు.
నా దృష్టిలో ప్రజలకు సేవ చేసే అతిపెద్ద స్వచ్చంద సంస్థ ప్రభుత్వమే అని ఆమె అన్నారు.ప్రజలకు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం దగ్గరికే వస్తారని ఈషా సింగ్ చెప్పుకొచ్చారు.
నేరరహిత అంశమైనా పోలీసులను ఆశ్రయిస్తారు కాబట్టి పోలీస్ కావాలని అనుకున్నానని ఆమె తెలిపారు.

న్యాయవాద నేపథ్యం ఉండటం నా సివిల్స్ ప్రిపరేషన్ కు ఉపయోగపడిందని ఆమె కామెంట్లు చేశారు.తొలి ప్రయత్నంలో ఐపీఎస్ సాధించానని విధి నిర్వహణలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి పెట్టానని ఈషా సింగ్ పేర్కొన్నారు.ఈషా సింగ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఈషా సింగ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.







