ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసులో కెనడా దూకుడుపై భారత్ మండిపడిన సంగతి తెలిసిందే.ఈ కేసు అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ) పేరును చేర్చడంపై న్యూఢిల్లీ భగ్గుమంది.
దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించి.తాత్కాలిక హైకమీషనర్‌గా నాయక్‌ను నియమించింది.
ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ కుమార్ వర్మ కెనడాలోని( Canada ) పరిస్ధితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కెనడాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారతీయ విద్యార్ధులు( Indian Students ) పరిసరాలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.ఖలిస్తాన్ ఉగ్రవాదులు, మద్ధతుదారుల నుంచి కెనడాలోని భారతీయ కమ్యూనిటీకి ముప్పు పొంచి ఉందని వర్మ పేర్కొన్నారు.విద్యార్ధులకు డబ్బు, ఆహారం అందించే ముసుగులో వారికి ఉగ్రవాదులు దగ్గరై ప్రభావితం చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కెనడాలోని భారతీయ దౌత్య కార్యకలాపాల వెలుపల నిరసనలు నిర్వహించేందుకు, భారత జాతీయ పతాకాన్ని అవమానించేలా, సోషల్ మీడియాలో భారత వ్యతిరేకతను పోస్ట్ చేసేందుకు విద్యార్ధులను ఖలిస్తానీలు( Khalistan ) ఉపయోగించుకుంటున్నారని సంజయ్ కుమార్ వర్మ పేర్కొన్నారు.కెనడాలో ఉంటున్న పిల్లలతో వారి తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రతిరోజూ టచ్‌లో ఉండాలని, వారి పరిస్ధితిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు.నిజ్జర్ హత్యపై జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి కెనడా అధికారులు తనతో ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని వర్మ తెలిపారు.
కెనడా భూభాగంపై పలు రాడికల్, తీవ్రవాద గ్రూపులు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వీటిపై ట్రూడో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని వర్మ స్పష్టం చేశారు.26 రాడికల్ ఎలిమెంట్స్, గ్యాంగ్‌స్టర్‌లను తమకు అప్పగించాలని తాము కోరినప్పటికీ కెనడా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.