తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూర్యకి( Surya ) చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.ప్రస్తుతం ఆయన కంగువా సినిమాతో( Kanguva Movie ) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
ఈ సినిమాతో మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నారనేది కూడా తెలుస్తోంది.ఇక సూర్య డ్యూయల్ రోల్ లో( Surya Dual Role ) నటిస్తున్న ఈ సినిమాలో ఒక సాంగ్ లో సూర్య 10 క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి డిఫరెంట్ వేరియేషన్స్ ని చూపించడంలో సూర్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు.కాబట్టి ఒక సాంగ్ కోసం ఆయన విపరీతంగా కష్టపడినట్టుగా కూడా తెలుస్తోంది.దశావతారంలో( Dasavatharam ) సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan ) 10 క్యారెక్టర్లలో ఎలాగైతే నటించాడో ఈ సినిమాలో సూర్య కూడా ఒక సాంగ్ లోనే 10 డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే సూర్య కెరియర్ అనేది స్టార్ హీరోగా ముందుకు సాగుతుంది.లేకపోతే మాత్రం ఆయన కొంతవరకు తడబడాల్సిన అవసరమైతే ఏర్పడుతుంది.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేస్ లో సూర్య ఉన్నాడు.
రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోల కెరియర్ అయిపోవడంతో ప్రస్తుతం విజయ్ కూడా రాజకీయాల బాట పట్టడంతో ఇప్పుడు సూర్య నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.ఇప్పుడు ఆయన దానికోసమే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…
.