పుష్ప ది రైజ్( Pushpa The Rise ) ఈ ఏరియా ఆ ఏరియా అనే తేడాల్లేకుండా అన్ని ఏరియాలలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.భాషతో సంబంధం లేకుండా బన్నీకి క్రేజ్ పెరుగుతోంది.పుష్ప ది రైజ్ సినిమా శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో 20 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.బాహుబలి2,( Bahubali 2 ) ఆర్.ఆర్.ఆర్( RRR ) కర్ణాటకలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.
పుష్ప ది రూల్ కర్ణాటక రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.ఆ ఏరియాలో మాత్రమే పుష్ప2( Pushpa 2 ) 100 కోట్ల కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.పుష్ప2 సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే పుష్ప2 మేకర్స్ కు 420 కోట్ల రూపాయలు వచ్చాయని భోగట్టా.

వెస్ట్ బెంగాల్ లో( West Bengal ) సైతం పుష్ప ది రూల్ రిలీజ్ కానుండటం గమనార్హం.కేవలం నాన్ థియేట్రికల్ హక్కులతోనే పుష్ప ది రూల్ బడ్జెట్ రికవరీ అవుతుందని చెప్పవచ్చు.ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని డిసెంబర్ నెల 5వ తేదీన ఈ సినిమా కచ్చితంగా విడుదల కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప2 బన్నీ రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచడం పక్కా అని చెప్పవచ్చు.

పుష్ప ది రూల్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ చేసిందని సమాచారం అందుతోంది.పుష్ప2 సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పుష్ప2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.పుష్ప ది రూల్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది.







