బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూర్యకు( Surya ) ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సూర్య తన సినీ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.
గజిని, సింగం సిరీస్, మరికొన్ని సినిమాలు సూర్య రేంజ్ ను పెంచాయి.సూర్య మరికొన్ని రోజుల్లో కంగువా సినిమాతో( Kanguva ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా సూర్య భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.
అయితే సూర్య హైట్ పై బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood ) కొన్ని నెగిటివ్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
సూర్యను హర్ట్ చేసే విధంగా ఈ కథనాలు ఉండటంపై సూర్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.మరీ ఇంత ఘోరం ఏంటంటూ సూర్య అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.సూర్య ఆకాశమే నీహద్దురా సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

హైట్ విషయంలో బాడీ షేమింగ్( Body Shaming ) కరెక్ట్ కాదంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.సూర్య సైతం ఈ కామెంట్ల విషయంలో ఒకింత ఫీలవుతున్నారని తెలుస్తోంది.సూర్య కంగువా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ కు మరో నెల రోజుల సమయం ఉంది.కంగువా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మాత్రం అదరగొట్టిందనే చెప్పాలి.

కంగువా సినిమాకు సీక్వెల్ కూడా ఉందనే సంగతి తెలిసిందే.కంగువా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.సూర్య కంగువా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సూర్యకు కంగువా సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ఆయితే దక్కాలని ఈ హీరో అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.







