తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతుంది.అలాగే మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంది.
నిజానికి మనవాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి.ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా మన వాళ్ళు సినిమా తీయడం అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరికీ చాలావరకు ప్లస్ పాయింట్ గా మారింది.
ముఖ్యంగా బాలీవుడ్ హీరోల( Bollywood Heroes ) పరిస్థితి మరి దారుణంగా తయారైంది.

వారు చేసిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించకపోగా మన హీరోల సినిమాలు భారీ బ్లాక్ బాస్టర్లుగా నిలవడం అనేది ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక ప్రస్తుతం వాళ్ళు కూడా వరుస సినిమాలను చేస్తున్నప్పటికి వచ్చిన సినిమాలు వచ్చినట్టు డిజాస్టర్ బాట పడుతుండటం అలాగే ఏం చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో అయితే ఉన్నారు.ఇక మొత్తానికైతే ప్రభాస్, రాజమౌళి ఇద్దరు దిగ్గజాలు బాహుబలి సినిమాతో( Bahubali ) పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్ కి తెరలేపారు.

మిగతా దర్శకులు కూడా రెచ్చిపోతూ పాన్ ఇండియా సినిమాలను( Pan India Movies ) చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న దర్శకులు కూడా తమను తమ స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు… ఇక ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులందరు తెలుగు సినిమాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన దర్శకుల బాటపడుతూ మనలాంటి సినిమాలను చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక బాలీవుడ్ ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం మన సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కడంతో బాలీవుడ్ మేకర్స్ ఇలాంటి పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది…
.







