పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో సుకుమార్( Sukumar ) తనదైన రీతిలో భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా ప్రొడ్యూసర్లు సినిమా అద్భుతంగా వచ్చిందని చెప్పడం విశేషం… సుకుమార్ ప్రతి ఫ్రేమ్ తను అనుకున్నట్టుగానే తెరకెక్కిస్తున్నారని తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి సుకుమార్ చాలావరకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి మొత్తానికైతే ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతుంది.ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.మరి సుకుమార్, అల్లు అర్జున్( Allu Arjun ) మరోసారి ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లు దాటడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.ఇప్పటివరకు ఏ సినిమాకి ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరగలేదు.
కాబట్టి ఈ సినిమా విషయంలో మాత్రం ఇది చాలా హైలెట్ గా నిలుస్తుంది.

అలాగే అల్లు అర్జున్ తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడంలో కూడా చాలా వరకు సక్సెస్ సాధించాడు.ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా తారాస్థాయికి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు.తద్వారా ఆయన ఏ రేంజ్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…