ప్రతి వారం శుక్రవారం రోజు ఎన్నో రకాల సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అవుతూనే ఉంటాయి అన్న విషయం మనం అందరికీ తెలిసిందే.అందులో భాగంగానే నేడు అనగా అక్టోబర్ 25న కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి.
అందులో నరుడి బ్రతుకు నటన సినిమా కూడా ఒకటి.మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అన్న వివరాల్లోకి వెళితే.
కథ :
సత్య (శివకుమార్ రామచంద్రవరపు) నటుడిగా రాణించడం తరచు ఆడిషన్స్ వెళ్తుంటాడు.కానీ వెళ్లిన ప్రతిసారి విఫలమవుతూ ఉంటాడు.దాంతో తన కొడుకు యాక్టర్ అవ్వడు అని తండ్రి (దయానంద్ రెడ్డి) అలాగే స్నేహితుడు (వైవా రాఘవ)( Vaiva Raghava ) వేరే ఉద్యోగం చూసుకోమని సలహా ఇస్తారు.కానీ సత్య మాత్రం ఎవరికి చెప్పకుండా కేరళకు వెళ్లిపోతాడు.
అక్కడ కొన్ని సమస్యల్లో ఇరుకొన్న సత్యకు D సల్మాన్ (నితిన్ ప్రసన్న) పరిచయం అవుతాడు.అలా కేరళకు వెళ్లిన సత్యా సినిమా ఇండస్ట్రీలో నటుడుగా రాణించాడా లేదా? నటుడిగా సత్య రాణించలేకపోవడానికి కారణం ఏమిటి? కేరళకు సత్య ఎందుకు వెళ్లాడు? కేరళలో సత్యకు ఎదురైన సమస్యలు ఏమిటి? సల్మాన్ పరిచయంతో సత్యాలో మార్పు వచ్చిందా? కొడుకు విషయం తెలుసుకుని సచ్చే తండ్రి ఏం చేశాడు? ఎవరికి సత్య నటుడు అయ్యాడా లేదా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ సినిమా కథను సింగిల్ లైన్ గా చూస్తే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది.కథను సన్నివేశాలుగా విస్తరించడంలో కూడా తన మార్కు చూపించుకున్నారు డైరెక్టర్.కానీ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాల విషయంలో మాత్రం తడబాటుకు గురయ్యాడని చెప్పాలి.ఫస్టాఫ్ లో ఒక చిన్న అమ్మాయి సీన్, ప్రెగ్నెంట్ ఉమెన్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి.
ఎమోషనల్ సినిమా అయినప్పటికీ అక్కడక్కడ కాస్త కామెడీతో చివరికి మంచి అనుభూతిని ఇచ్చే విధంగా కథను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది అని చెప్పాలి.అలాగే సెకండాఫ్ లో ఫన్‌తో పాటు ఎమోషనల్ సీన్లను జోడించిన కథను నడిపించిన విధానం హైలెట్ గా చెప్పకోవచ్చు.
అయితే మాములుగా ఇలాంటి ఆర్టిస్టిక్ కథలను ఓకే చేయడమే గ్రేట్.కానీ దాన్ని నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాత, ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసి రిలీజ్ చేసిన పీపుల్స్ మీడియాకి మంచి టేస్ట్ ఉందని చెప్పవచ్చు.
సాంకేతికత :
ఈ సినిమాతో డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి( Director Rishikeshwar Yogi )కి రచయితగా, ఎడిటర్ గా మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.అలాగే కేరళ అందాలను ఫాహద్ అబ్దుల్ మజీద్ అద్బుతంగా కెమెరాలో బంధించారని చెప్పాలి.సినిమాలోని ప్రతీ సన్నివేశం మంచి పెయింటింగ్ లా పచ్చ దనంతో నింపేశాడనే చెప్పాలి.బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది.అలాగే సినిమాలోని సన్నివేశాలలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ చూస్తే సన్నివేశాలను సహజంగా తెరకెక్కించారు అన్న అనుభూతి కలుగుతుంది.అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సీ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్స్, ఎస్ స్వ్కేర్ సినిమాస్ బ్యానర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు రిచ్‌గానే కాకుండా చాలా బాగున్నాయి.
ఇందులో మనకు నిర్మాత టేస్ట్ కూడా కనిపిస్తుంది.సినిమాను చూసినప్పుడు ఒక మంచి చిత్రాన్ని నిర్మించారు అన్నా అనుభూతి కలుగుతుంది.ఇలాంటి చిత్రాల్ని టేకప్ చేసి రిలీజ్ చేయడంలో పీపుల్స్ మీడియా, టీజీ విశ్వ ప్రసాద్ టేస్ట్ కూడా కనిపిస్తోంది.
నటీనటుల పనితీరు :
ఇకపోతే నటీనటుల పనితీరు విషయానికి వస్తే.ఇందులో హీరో శివకుమార్( Sivakumar ) తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అయితే ఈ సినిమా కంటే ముందు సైడ్ క్యారెక్టర్లలో నటించినప్పటికీ ఈ సినిమాతో మనలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అలాగే నితిన్ ప్రసన్న చేసిన సల్మాన్ క్యారెక్టర్ హైలెట్ అని చెప్పాలి.అలాగే మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
రేటింగ్ :
3/5