టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.ఇక మెగా కుటుంబం కేవలం సినిమా ఇండస్ట్రీలో( Film Industry ) మాత్రమే కాకుండా రాజకీయాలలో( Politics ) కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
గతంలో చిరంజీవి( Chiranjeevi ) ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన కొంతకాలానికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా జనసేన పార్టీని( Janasena Party ) స్థాపించి ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
సాయి ధరమ్ తేజ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఈయనకు తన మామయ్య పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టమైన సంగతి తెలిసిందే.తన మామయ్య కోసం ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు కూడా వచ్చారు.
అలాగే తన మామయ్యకు మద్దతుగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే ఈయన కూడా రాజకీయాలలోకి రాబోతున్నారంటూ ప్రచారం జరిగింది అయితే ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ స్పందించారు.
తాను రాజకీయాలలోకి రావడం లేదని తనకు అలాంటి ఆలోచనలు కూడా లేవని తెలిపారు.తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని సాయి తేజ్ వెల్లడించారు.మరెన్నో విభిన్నమైన చిత్రాల్లో యాక్ట్ చేయాలని, ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నా.రాజకీయాల్లోకి రావాలి అంటే చాలా విషయాలు నేర్చుకోవాలి.ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఈయన తెలియజేశారు.ఇది తనకు పునర్జన్మ అని చెప్పిన ఆయన.యాక్సిడెంట్ రోజులను గుర్తుచేసుకున్నారు.అలాగే బైక్ పై ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించే ప్రయాణం చేయండి అంటూ అందరికీ జాగ్రత్తలను కూడా తెలిపారు.