ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) అందని ద్రాక్షగా మారిపోయిన సంగతి తెలిసిందే.సిగ్నల్ కూడా లేని ప్రాంతాలలో ఉన్నత చదువులు చదివి కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదు.
అయితే బిని ముడులి( Bini Muduli ) అనే యువతి మాత్రం తన సక్సెస్ స్టోరీతో( Success Story ) అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.సిగ్నల్ కూడా లేని చోట ప్రిపేర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.
మారిమూల గ్రామంలో కఠిన పేదరికంతో నివశిస్తున్న కుటుంబంలో గిరిజన తెగలో జన్మించిన బిని ముడులి బలమైన సంకల్పంతో మంచి ఉద్యోగం సాధించాలని అనుకున్నారు.కోచింగ్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించే స్థాయికి బిని ముడులి చేరుకున్నారు.
ఇంట్లో ఇంటర్నెట్ కూడా రాకపోయినా బోండా తెగ నుంచి స్టేట్ సివిల్స్ లో జాబ్ సాధించిన మొదటి మహిళ బిని కావడం గమనార్హం.
యూట్యూబ్ వీడియోల సాయంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగం సాధించడం అంటే సాధారణ విషయం కాదనే చెప్పాలి.బిని ముడులి తండ్రి ప్రభుత్వ పాఠశాలలో వంట పని చేస్తుండగా తల్లి అంగన్ వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు.బిని ముడులికి ఉద్యోగం రావడంతో ఆమె తెగకు చెందిన వ్యక్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రస్తుతం బిని ముడులి వయస్సు 24 సంవత్సరాలు.
2020 సంవత్సరంలో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్( Odisha Public Service Commission ) పరీక్ష రాసిని బిని ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు.ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఆయుర్వేదిక్ అసిస్టెంట్ గా బిని ముడులి కెరీర్ ను మొదలుపెట్టారు.ఆన్ లైన్ లో దొరికే మెటీరియల్ సహాయంతో ఆమె లక్ష్యాన్ని సులువుగా సాధించారు.
బిని ముడులి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.