ప్రస్తుతం థియేటర్లోని రిలీజైన సినిమాలకు గడ్డుకాలం ఏర్పడిందని చెప్పుకోవచ్చు.మరీ ముఖ్యంగా కరోనా విధ్వంసం తరువాత జనాలను థియేటర్ లకు రప్పించడం చాలా కష్టంగా మారింది.
మరోవైపు OTT పుణ్యమాని స్మార్ట్ టీవిలలోనే సినిమాలను చూసే జనాలు పెరిగిపోయారు.మరోవైపు స్టార్ హీరోల చిత్రాలకి సైతం గండం ఏర్పడిందని చెప్పుకోవచ్చు.
సినిమా ఎంతో బావుంటే తప్పితే థియేటర్లకి జనాలు వెళ్లే పరిస్థితి లేదు.ఇలాంటి టైంలో పలు అంతర్జాతీయ వేదికల్లో అవార్డులు అందుకున్న చిత్రం విడుదలైంది.
అదే నరుడు బ్రతుకు నటన.( Narudi Brathuku Natana Movie ) ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చూసి, రిలీజ్ చేసేందుకు ముందుకు రాగా అక్టోబర్ 25న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది.
సినిమా కథ విషయానికొస్తే, సత్య (శివ) బాగా డబ్బున్నోడు.తండ్రి సంపాదించిన దాంతో జల్సాలు చేసుకుంటూ బతుకుతాడు.అయితే సత్యకి( Satya ) జాబ్స్ మీద పెద్దగా ఆసక్తి ఉండదు.చిన్నప్పటి నుంచి హీరో కావాలని కలలు కంటాడు.ఈ క్రమంలో షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాడు.తండ్రి పేరు అడ్డు పెట్టుకుని ఆడిషన్స్ ఇచ్చేందుకు వెళ్తాడు.
కానీ ఎక్కడా సెలెక్ట్ కాడు.దాంతో ఇంటా, బయట సత్యకి అవమానాలు ఎదురవుతాయి.
దాంతో నటుడు అవ్వాలంటే.కేవలం నటిస్తే సరిపోదు.
ముందు మనిషిలా బతకాలి.ఎమోషన్స్ గురించి తెలుసుకోవాలని సత్య స్నేహితుడు (వైవా రాఘవ్) సలహా ఇవ్వగా సత్య అదేమిటో తెలుసుకోవాలని భాష రాని, తనకి ఇదివరకు తెలియని చోటకు వెళ్తాడు.
అలా కేరళకు వెళ్లిన సత్యకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా సినిమా కథ.
ఇలాంటి సినిమాలు థియేటర్లో కమర్షియల్‌గా ఏమేర కలెక్షన్లు రాబడతాయో చెప్పలేం.కానీ ఓటీటీ ఆడియెన్స్‌ని మాత్రం ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.ఎందుకంటే సినిమా కథ ఆద్యంతం ఆలోచింపజేసిందిగా ఉంటుంది.
ఆర్టిస్టులుగా శివ కుమార్,( Shiva Kumar ) నితిన్ ప్రసన్నలు( Nithin Prasanna ) తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పుకోవచ్చు.సత్య, సల్మాన్ పాత్రలతో ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు.
శివ ఎమోషనల్‌గా నటించి మెప్పిస్తాడు.
టెక్నీకల్ బృందం విషయానికొస్తే, దర్శకుడు రిషికేశ్వర్ రెడ్డి మొదటి సినిమాతోనే చాలా కష్టమైన కథ బలం ఉన్న అంశాన్ని ఎంచుకున్నాడు.
కథను సింగిల్ లైన్‌గా చూస్తే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది.కానీ ఈ కథను తెరకెక్కించడం అంత తేలికైన విషయం కాదు.
ఫస్టాఫ్‌లో ఓ పాప సీన్, ప్రెగ్నెంట్ ఉమెన్ సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి.సెకండాఫ్‌లో ఫన్‌తో పాటు ఎమోషనల్ సీన్లతో కథను నడిపించిన విధానం చాలాబావుందనే చెప్పుకోవచ్చు.
కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా నిజాయితీగా ఎమోషనల్ టచ్‌తో సినిమాను ముగించడం ఒక మంచి ఫీల్ కలిగిస్తుంది.