గజినీ సీక్వెల్ సినిమా రాబోతోందా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya ) గతంలో నటించిన సూపర్ హిట్ సినిమాలలో గజినీ( Ghajini ) సినిమా ఒకటి.2005వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది.డైరెక్టర్ మురగదాస్( Murugadass ) దర్శకత్వంలో సూర్య ఆసిన్ నయనతార ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాష చిత్రాలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రీమేక్ చేశారు.అమీర్ ఖాన్( Aamir Khan ) హీరోగా మురగదాస్ డైరెక్షన్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా సంచలనమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Suriya Interesting Comments On Gajini 2 Movie Details, Gajini 2,suriya,muragadas-TeluguStop.com

ఇక హిందీలో ఈ చిత్రాన్ని తెలుగు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించి భారీ లాభాలను అందుకున్నారు.

Telugu Aamir Khan, Ameer Khan, Gajini, Ghajini, Ghajini Sequel, Kanguva, Muragad

ఇక ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కంగువ( Kanguva ) ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న సూర్యకు ఇదే ప్రశ్న ఎదురయింది.గతంలో కూడా డైరెక్టర్ మురగదాస్ పలు సందర్భాలలో గజినీ సీక్వల్( Ghajini Sequel ) వస్తుందంటూ తెలియజేశారు.

తాజాగా హీరో సూర్య మాట్లాడుతూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Telugu Aamir Khan, Ameer Khan, Gajini, Ghajini, Ghajini Sequel, Kanguva, Muragad

ప్రస్తుతం డైరెక్టర్ మురగదాస్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు.దాదాపు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయని షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టిన తాను కూడా సిద్ధంగానే ఉన్నానని తెలియజేశారు.ఇక ఈ సినిమాలో తాను అమీర్ ఖాన్ తో కలిసి సందడి చేయబోతున్నానంటూ కూడా ఈ సందర్భంగా సూర్య తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

సూర్య చేసిన ఈ కామెంట్స్ పై పలువురు నేటిజన్స్ స్పందిస్తూ ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube