మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అందులో భాగంగానే తన అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పటికప్పుడు కొన్ని పోస్టులను ఫోటోలను పంచుకుంటూ ఉంటారు మెగాస్టార్.

కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి దాకా ఏదో ఒక సందర్భంలో మధుర జ్ఞాపకంగా నిలిచిన విషయాలను ఆయన తరచూ గుర్తు చేసుకుంటారు.తాజాగా ఆయన ఒక అరుదైన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దానికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.
నరసాపురం, వై.ఎన్.ఎం కాలేజ్ బీకాం డిగ్రీ చదువుతున్న రోజుల్లో రంగస్థలం పై ఆయన వేసిన తొలి నాటకానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.
రాజీనామా కాలేజీలో రంగస్థలం మీద వేసిన తొలి నాటకం.

కోన గోవిందరావు రచన, నటుడిగా తొలి గుర్తింపు, అది ఉత్తమ నటన కావడం, ఎనలేని ప్రోత్సాహం. 1974 నుంచి 2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానం.ఎనలేని ఆనందం అంటూ చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.ఆ పోస్ట్ ని చూసిన మెగాస్టార్ అభిమానులు రకరకాల స్పందిస్తున్నారు.
ఇకపోతే మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం ఆయన విశ్వంభర ( Vishwambhara )చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు.కానీ పలు కారణాలతో ఈ చిత్రం వెనక్కి వెళ్లింది.
వశిష్ఠ దర్శకత్వం( Director Vasishta )లో యు.వి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.







