టాలీవుడ్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరే హీరో చేయని విధంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ఆరు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్.
ఇది ఇలా ఉంటే ఇటీవల అనగా అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ప్రభాస్ అభిమానులు.

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు( Prabhas birthday ) సందర్భంగా ది రాజా సాబ్ సినిమా( The Raja Saab ) నుంచి మోషన్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ పోస్టర్ విడుదలైన 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేశారు.24 గంటల తర్వాత కూడా ఈ మోషన్ పోస్టర్ వీడియో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం.ప్రభాస్ కెరీర్‌లోనే మొట్టమొదటిసారి హర్రర్ జానర్‌లో నటిస్తోన్న ఈ రాజా సాబ్‌పై మోషన్ పోస్టర్ భారీగా అంచనాలను పెంచేసింది.
కాకపోతే అక్కడక్కడా ట్రోలింగ్ కూడా మొదలైంది.

అయినా సరే ప్రభాస్ మేకోవర్ ఈ సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తోంది.అసలు మారుతి, ప్రభాస్‌తో ఏం చేయిస్తున్నాడో అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో అలాగే అభిమానులలో బాగా పెరిగిపోయింది.ఇకపై రాబోయే అప్డేట్స్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం అని తెలుస్తోంది.
అయితే ప్రభాస్ కు ఇలా రికార్డులు క్రియేట్ చేయడం అన్నది కొత్త ఏం కాదు అని చెప్పాలి.ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రికార్డులు ప్రభాస్ పేరు మీద ఉన్న విషయం తెలిసిందే.
అలాగే సినిమా కలెక్షన్ల పరంగా కూడా ప్రభాస్ టాప్ లో ఉన్నారు.ఇప్పుడీ రాజా సాబ్ మోషన్ పోస్టర్ ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది.







