స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.బన్నీ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం ఊహించని విధంగా పెద్ద వివాదం అయింది.
బన్నీ వైసీపీకి( YCP ) సపోర్ట్ చేయడం ఏంటనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వినిపించాయి.అయితే మైత్రీ నిర్మాతలలో ఒకరైన రవి( Ravi ) మాత్రం బన్నీ రాజకీయంగా ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
బన్నీ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని పొలిటికల్ గా విభేదాలు ఉన్నాయని చెప్పడం సరికాదని మనమంతా సినీ లవర్స్ అని మైత్రీ రవి తెలిపారు.మైత్రీ నవీన్( Mythri Naveen ) మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చిన్నచిన్న సమస్యలు ఎదురై ఉండవచ్చని ఆయన తెలిపారు.
కానీ వారంతా ఒక్కటేనని కామెంట్లు చేశారు.రాజకీయాలకు అతీతంగా ఈ సినిమాను చూడాలని అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

టికెట్ ధరల పెంపు గురించి మైత్రీ నవీన్ స్పందిస్తూ కల్కి సినిమా రిలీజ్ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను( AP Deputy CM Pawan ) కలిశానని ఆయన నుంచి సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే పుష్ప ది రూల్ కు( Pushpa The Rule ) భారీ టికెట్ రేట్లు ఉండటం పక్కా అని చెప్పవచ్చు.మరోవైపు జానీ మాస్టర్ కు బదులుగా పుష్ప2 సినిమా కోసం వేరే కొరియోగ్రాఫర్ ఎంపికయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.పుష్ప ది రూల్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని మేకర్స్ చెబుతున్నారు.పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మాత్రం పుష్ప ది రూల్ సాధించే సంచలనాలు అయితే మామూలుగా ఉండవని చెప్పవచ్చు.