భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ( Mohammed Shami ) అన్ని క్రికెట్ ఫార్మాట్లలో తన సత్తా ఏంటో చాటుతున్నాడు.ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ విజేతగా మహమ్మద్ షమీ నిలిచాడు.
మరొకవైపు ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో( WTC Final ) మహమ్మద్ షమీ తన అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు.అయితే మహమ్మద్ షమీ వన్డే క్రికెట్లో( One Day Cricket ) ఓ అద్భుతమైన రికార్డు సాధించాడు.
ఈ రికార్డును ఏ భారతీయ బౌలర్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చెయ్యకపోవడం గమనార్హం.క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులను బ్రేక్ చేయడం చాలా కష్టం.
ఇంతకీ మహమ్మద్ షమీ సాధించిన ఆ రికార్డు వివరాలు ఏమిటో చూద్దాం.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా, తక్కువ మ్యాచ్లలో 100, 150 వికెట్లు తీసిన భారత బౌలర్ గా మహమ్మద్ షమీ నిలిచాడు.వన్డేలలో 100 వికెట్లు తీయడానికి మహమ్మద్ షమీ 56 మ్యాచులు ఆడాడు.ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.
ఇక రెండవ స్థానంలో భారత స్టార్ పాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఉన్నాడు.వన్డేలలో 100 వికెట్లు తీయడానికి బుమ్రా 57 మ్యాచులు ఆడాడు.
ఇక మూడవ స్థానంలో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ నిలిచాడు.
మహమ్మద్ షమీ వన్డేలలో 150 వికెట్లు పూర్తి చేయడానికి 80 మ్యాచ్లు ఆడాడు.దీంతో భారత్ నుంచి వన్డేలలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.షమీ అంతర్జాతీయ క్రికెట్ లోకి 2013 లో పాకిస్తాన్- ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ తో వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు.
షమీ తన కెరీర్లో ఇప్పటివరకు 90 వన్డేలు, 64 టెస్టులు, 23 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడాడు.టెస్ట్ మ్యాచ్ లలో 229 వికెట్లు తీశాడు.వన్డే మ్యాచ్లలో 162 వికెట్లు తీశాడు.టీ20 మ్యాచ్లలో 24 వికెట్లు తీశాడు.