Chandrababu Roja: ఆ ఫ్లైట్ లో చంద్రబాబుకు ఎదురుపడ్డ మంత్రి రోజా.. అతర్వాత ఏం జరిగిందంటే?

సినీ నటి రోజా( Roja ) ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ముందు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) లో చేరారు అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.

 Tdp Chief Chandrababu Couple And Minister Roja Travelled In Same Indigo Flight-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతూ ఉన్నటువంటి రోజా రాజకీయాల పరంగా ప్రతిపక్ష పార్టీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.ఇలా వైయస్సార్సీపి పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రోజా తరచూ టిడిపి నేతలపై అలాగే చంద్రబాబు(Chandra Babu Naidu) లోకేష్ (Lokesh) బాలకృష్ణ పట్ల కూడా ఫైర్ అవుతూ ఉంటారు.

Telugu Chandrababu, Indigo, Roja, Bhuvaneshwari, Tirumala Temple, Tirupathi, Vij

ఇలా చంద్రబాబుపై తరచూ నిప్పులు చేరిగే రోజా తాజాగా ఆయనతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది.ఈమె తిరుపతి నుంచి విజయవాడకు వెళ్లడం కోసం ఇండిగో ఫ్లైట్ లో( Indigo Flight ) వెళ్లారు.అదే ఫ్లైట్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి విజయవాడ ప్రయాణమయ్యారు.అయితే చంద్రబాబు నాయుడు అదే ఫ్లైట్లో ఉన్నారనే విషయం ముందుగా రోజాకు తెలియదు.

అనంతరం వారిని చూసినటువంటి ఈమె ఫ్లైట్ సిబ్బందిని పిలిచి తనకు సీట్ మార్చమని చెప్పారు.అయితే అప్పటికి అన్ని రిజర్వ్ అయ్యి ఉండడంతో కుదరదని చెప్పగా తప్పనిసరి పరిస్థితులలో రోజా అక్కడే కూర్చుని వారితో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది.

Telugu Chandrababu, Indigo, Roja, Bhuvaneshwari, Tirumala Temple, Tirupathi, Vij

ఇక చంద్రబాబు నాయుడు అంటే ఏమాత్రం ఇష్టపడినటువంటి ఈమె తప్పనిసరి పరిస్థితులలో వారితో కలిసి ఒకే ఫ్లైట్లోనే విజయవాడ( Vijayawada ) చేరుకున్నారు.చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో( Skill Development Scam ) భాగంగా అరెస్టయి 52 రోజులపాటు జైల్లో ఉన్న సంగతి మనకు తెలిసింది.అయితే ప్రస్తుతం ఈయన బెయిల్ పై బయటకు వచ్చారు.ఇలా బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన కార్యం ప్రారంభించడానికి ముందు తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.

ఇలా స్వామివారి దర్శనం అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు.మరి ఈయన తలపెట్టబోతున్నటువంటి ఆ ముఖ్య కార్యం ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.

Telugu Chandrababu, Indigo, Roja, Bhuvaneshwari, Tirumala Temple, Tirupathi, Vij

ఇలా చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలలో బిజీగా కానున్నారు.అయితే రాష్ట్ర ఎన్నికలు త్వరలోనే జరగబోతున్న నేపథ్యంలో ఈయన రాజకీయాలలో బిజీ కానున్నారని తెలుస్తోంది.ఇప్పటికి లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే రాజకీయ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.అందుకే ముందుగా శ్రీవారిని దర్శించుకుని తన ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube