ఇదేంటి 'బండి ' ఇలా మాట్లాడుతున్నారు ..?

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు( Bandi Sanjay ) ఈ మధ్యకాలంలో కాలం కలిసి వచ్చినట్లుగా కనిపించడం లేదు.తెలంగాణ బిజెపిలో( Telangana BJP ) గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని, సంజయ్ను వ్యతిరేకిస్తున్న నాయకులు బిజెపిలో ఎక్కువయ్యారనే ప్రచారం జరుగుతుండగానే సంజయ్ వ్యవహాత్మక తప్పిదాలు చేస్తూనే వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

 Tbjp President Bandi Sanjay Sensational Comments On Dharani Portal Details, Tela-TeluguStop.com

ఇటీవల కాలంలో సంజయ్ కు వ్యతిరేకంగా బిజెపి అధిష్టానం కు ఫిర్యాదులు అందుతున్నాయి.ఒక దశలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించబోతున్నారనే ప్రచారం ఊపు అందుకుంది.

ఈ విషయంలో బిజెపి హైకమాండ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు హోదాలో సంజయ్ బీఆర్ఎస్ ను ఇరుక్కుని పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే అనేక హామీలను ఆయన ప్రకటిస్తున్నారు.ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ‘ ధరణి ‘ పై( Dharani ) ఎన్నో వివాదాలు నెలకొన్నాయి.

Telugu Dharani, Aicc, Ap, Bandi Sanjay, Brs, Congress, Revanth Reddy, Telangana

మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ ధరణి విషయంలో అనేక సంచలన ఆరోపణలు చేస్తున్నాయి.కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ధరణిని రద్దు చేస్తామంటూ ప్రకటించగా, ఇప్పుడు ఇదే ధరణిపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ కామెంట్స్ చేస్తున్నారు.తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే, ధరణిని రద్దు చేయమని, తప్పులను సరిదిద్దుతామంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.కెసిఆర్ కుటుంబానికి ఉపయోగపడుతున్న ధరణిని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా చేస్తానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఒకటి రెండు మినహా మిగతావన్నీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని వాటిని కూడా కొనసాగిస్తామని సంజయ్ వ్యాఖ్యానించారు.

Telugu Dharani, Aicc, Ap, Bandi Sanjay, Brs, Congress, Revanth Reddy, Telangana

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ధరణి పోర్టల్ పై తీవ్రమైన చర్చ జరుగుతుంది .మొదటి నుంచి ధరణి పోర్టల్ విషయమై కాంగ్రెస్ విమర్శలు చేస్తూనే వస్తోంది.తాము అధికారంలోకి వస్తే దాన్ని తీసుకువెళ్లి బంగాళాఖాతంలో కలుపుతామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వంటి వారు అనేకసార్లు ప్రకటించారు.

ఇక బిజెపి నేతలు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగానే స్పందిస్తూ వస్తుండగా, దీనికి విరుద్ధంగా బండి సంజయ్ స్పందిస్తూ వస్తుండడం వంటివి తెలంగాణ బీజేపీ నాయకులకు రుచించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube