అమెరికాలో భారత రాయబారిగా తరంజిత్ సంధు

అమెరికాలో భారత కొత్త రాయబారిగా తరంజిత్ సంధు నియమితులయ్యారు.ఆయన నియామకం పట్ల ఎన్ఆర్ఐలు, ఇండో-అమెరికన్లు, అమెరికన్ వ్యాపారవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.1988 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్.ఆయన వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీలో రెండు కీలక పదవులను నిర్వహించారు.2013 నుంచి 2017 వరకు డిప్యూటీ అంబాసిడర్‌గానూ వ్యవహరించారు.

 Taranjit Singh Sandhu Appointed As Indias New Ambassador In Us-TeluguStop.com

ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్న హర్ష్‌వర్థన్ ష్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా నియమితులైన నేపథ్యంలో తరంజిత్‌ను కొత్త రాయబారిగా నియమించారు.

ప్రస్తుతం శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా ఉన్న సంధు త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుందని ఇండియాస్‌పోరా వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి పీటీఐకి వివరించారు.

Telugu Taranjitsingh, Telugu Nri-

సంధు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లోనూ పనిచేశారు.రాజకీయ, విధానపరమైన సవాళ్లతో పాటు భారతదేశంపై పెరుగుతున్న ఆర్ధిక దృష్టి మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో సవాళ్లను అధిగమించడానికి అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి అనుభవజ్ఞుడైన సంధు నియామకం సరైనదేనని దక్షిణ, మధ్యాసియా మాజీ అసిస్టెంట్ సెక్రటరీ నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు.

2014లో ప్రధాని నరేంద్రమోడీ చారిత్రాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీని నిర్వహించడంలో సంధు, అప్పటి భారత రాయబారి ఎస్ జైశంకర్‌తో కలిసి పనిచేశారు.

అమెరికాకు కొత్త భారత రాయబారిగా నియమితులైన తరంజిత్ సింగ్‌‌కు యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ అభినందనలు తెలిపింది.

అమెరికా- భారత్‌ల మధ్య వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సందు కృషి చేస్తారని కౌన్సిల్ ఆకాంక్షించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube