నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి' నుండి తార నా తార పాట విడుదల

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’.ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది.

 Tara Na Tara Song Released From Naga Shaurya Krishna Vrinda Vihari Movie Details-TeluguStop.com

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

కృష్ణ వ్రింద విహారి లోని తార నా తార పాట‌ విడుద‌ల అయింది.

నాగ శౌర్య, షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీ ని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు మహతి.లీడ్ పెయిర్ బైక్ రైడ్‌ కివెళ్ళడం, షిర్లీ కౌగలించుకున్నపుడు శౌర్య మదురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా వుంది.

ఈ పాటకి శ్రీమణి సాహిత్యం యూత్‌ఫుల్‌ గా ఉంది.నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్ గా పాడారు.

అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.‘కృష్ణ వ్రింద విహారి’ సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం:

నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు.

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: అనీష్ ఆర్.కృష్ణ,

నిర్మాత: ఉషా ముల్పూరి,

సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి,

బ్యానర్: ఐరా క్రియేషన్స్,

సంగీతం: మహతి స్వరసాగర్,

డివోపీ: సాయిశ్రీరామ్,

సహ నిర్మాత: బుజ్జి,

ఎడిటర్ – తమ్మిరాజు,

ఆర్ట్ డైరెక్టర్ – రామ్‌ కుమార్,

డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్,

పీఆర్వో: వంశీ, శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube