సినీనటి తాప్సీ( Tapsee ) ఇటీవల తన ప్రియుడిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె గత కొంతకాలంగా డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్ ( Mathias Boe )అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ మార్చి 23న ఉదయ్ పూర్ లో అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం( Marriage ) చేసుకున్నారు.అయితే వీరి వివాహం చాలా రహస్యంగా జరిగింది.
వివాహానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.దీంతో తాప్సీ పెళ్లి చేసుకున్నారనే విషయం తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇక ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే పెద్ద ఎత్తున హంగామా చేస్తారు కానీ ఈమె మాత్రం సైలెంట్ గా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే సందేహాలు అందరికీ కలిగాయి.ఇదే విషయం గురించి తాప్సీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పుకోవడం ఇష్టం ఉండదని అందుకే పెళ్లి విషయాన్ని కూడా రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని ఈమె తెలిపారు.
నా వివాహానికి సంబంధించిన విషయాలను అందరికీ చెబుతూ అందరిలోనూ ఆసక్తి పెంచాలని నేను కోరుకోలేదు.నా పెళ్లి గురించి అందరూ చర్చించుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు అందుకే తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయటకు చెప్పలేదని వెల్లడించారు.ఇది నా అభిప్రాయం మాత్రమే.
ఈ విషయంలో నా భర్తకు మరో అభిప్రాయం ఉండొచ్చు.అందుకే మేము దీని గురించి మీడియా, సోషల్ మీడియాలో చెప్పలేదు.
పెళ్లి చేసుకున్న సంగతిని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం లేదు.ఈ పెళ్లి విషయంలో మా కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యారు.
నా సన్నిహితులకు కూడా ఈ విషయాలు తెలుసు.పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది.
దాన్ని ఆనందంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా.అందుకే ఎలాంటి ఆర్భాటాలకు చోటివ్వకుండా ఒకటయ్యామని ఈమె తెలిపారు.