టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉండగా గుంటురు కారం సినిమాకు( Guntur Karam Movie ) సంబంధించి స్క్రిప్ట్ విషయంలో, నటీనటుల విషయంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేయగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరో మహేష్ బాబు ఈ కారును కొనుగోలు చేయడం కోసం ఏకంగా 5.4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారును( Range Rover Car ) మహేష్ బాబు కొనుగోలు చేశారు.హైదరాబాద్ లో ఈ మోడల్ కారు ఇదే మొదటిదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే మహేష్ బాబు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేయడంలో ఆశ్చర్యం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కారుకు సంబంధించిన ఫోటోలను చూసిన మహేష్ బాబు అభిమానులు తెగ మురిసిపోతున్నారు.మహేష్ గుంటూరు కారం మూవీ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి 2024 సంక్రాంతికి విడుదల చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సర్కారు వారి పాట విడుదలై దాదాపుగా ఏడాది కావడంతో సినిమాల విషయంలో మహేష్ వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరి ఎంపికయ్యారని తెలుస్తోంది.
అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తను నమ్మాల్సి ఉంటుంది.అయితే నటీనటులకు సంబంధించిన మార్పు వల్ల గుంటూరు కారం సినిమా బడ్జెట్ పెరుగుతోంది.ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
జగపతిబాబు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.