ఎమ్మెస్ నారాయణ పెళ్లి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా ?

జీవితంలో చాలామంది కష్టాలు పడే సినిమా ఇండస్ట్రీకి వస్తారు.కానీ కష్టం అంటే ఇలా కూడా ఉంటుందా అని అనిపించేలా ఉంటుంది ఎమ్మెస్ నారాయణ( MS Narayana ) జీవితం.

 Struggles Of Ms Narayana Early Days Details, Ms Narayana, Comedian Ms Narayana,-TeluguStop.com

చిన్నతనంలో ఎంతో పెద్ద కుటుంబం ఎన్నో కష్టాలు పడ్డారు.ఇంట్లో అందరూ కలిసి పొలం పనులు చేసిన ఒకరో ఇద్దరో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి.

అలాంటి పరిస్థితులలో కూడా తన కుటుంబం చదువుకుంటే తప్ప బాగుపడదు అని నమ్మిన వ్యక్తి ఎమ్మెస్ నారాయణ.ఇంట్లో అందరూ పొలం పనులకు వెళుతుంటే ఎమ్మెస్ నారాయణ మాత్రమే బడికి వెళ్లేవారు.

విషయం తెలిసిన పని చేయకుండా బడికి వెళ్ళినందుడుకు కోపంతో బడి కి వచ్చి తన తండ్రి లాక్కెళ్లిన రోజులు ఎన్నో ఉన్నాయి.కేవలం బడి ఎగ్గొట్టడానికే స్కూలుకు వెళుతున్నాడు అని ఇంట్లో వాళ్ళు అనుకునేవారు.

Telugu Yana, Kala Prapoorna, Yana Journey, Yanakala, Yana Struggles, Paruchurigo

కానీ ఎమ్మెస్ నారాయణ ఆశయం వేరు… అందుకోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాడు.తాను చదువుకోవాలని కుటుంబాన్ని పోషించాలి అనుకుంటున్నాను.అదే విషయం తండ్రికి చెప్పడంతో కన్నీళ్ళతో మరుసటి రోజు తన తండ్రి స్వయంగా వెళ్లి స్కూల్లో దింపి వచ్చారు.అలా చిన్నతనంలోనే ఇంట్లో పెద్ద యుద్దమే చేశారు ఎం ఎస్ నారాయణ.

సినిమా ఇండస్ట్రీ( Cinema Industry ) అంటే చిన్నతనం నుంచి ఇష్టం ఉంది.కానీ పేదరికం ఆ విషయాన్ని బయట పెట్టనివ్వలేదు.స్కూల్లో తెలుగు మాస్టారుగా ఓవైపు పాఠాలు చెబుతూనే మరోవైపు సినిమా ప్రయత్నాలు చేశారు.పేరుకే ఆయన కమీడియన్( Comedian ) కానీ ఆయనొక మంచి రచయిత.

ఎన్నో కథలు రాసుకునేవారు తనతో పని చేసే స్కూల్లో ప్యూన్ కి వందల కథలను వినిపించేవారు.

Telugu Yana, Kala Prapoorna, Yana Journey, Yanakala, Yana Struggles, Paruchurigo

ఏళ్లకు ఏళ్లు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించారు.వారం అంతా పని చేసి శనివారం సాయంత్రం బయలుదేరి చెన్నైకి వెళ్ళిపోయి ఆదివారం సినిమా ప్రయత్నాలు చేసి సోమవారం పొద్దున్నే మొదటి గంటకు స్కూల్లో ఉండేవారు.అలా ఎన్నో ఏళ్ళు తిరగగా పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopala Krishna ) పరిచయం ఆయన జీవితాన్ని మార్చేసింది.

ఆయనే ఎంతో మందికి ఎమ్మెస్ నారాయణను పరిచయం చేసి అవకాశాలు వచ్చేలా చేశారు.చివరికి కళా ప్రపూర్ణ( Kala Prapurna ) అనే అమ్మాయిని ప్రేమించిన విషయం కూడా గోపాలకృష్ణకె మొదట చెప్పగా ఆయన దగ్గరుండి వీరిద్దరికి వివాహం కూడా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube