సినిమా ఇండస్ట్రీ కి వరుసగా హీరో లా కొడుకులు హీరో లుగా ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే నిజానికి ఇక్కడ ఉన్న హీరోల్లో చాల మంది వాళ్లే ఉన్నారు అని చెప్పవచ్చు నిజానికి ఇక్కడ చేస్తున్న ప్రతి హీరో కూడా తనదైన మార్క్ నటన చూపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికి ఇప్పుడు మాత్రం చాలా మంది హీరో ల కొడుకులు ఇండస్ట్రీ లో పాగా వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే శ్రీకాంత్( Srikanth ) కొడుకు అయినా రోషన్( Roshan ) కూడా పెళ్ళిసందడి సినిమా తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.
ఇక దాంతో తన నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో చేద్దాం ఎలాంటి సబ్జెక్టు ని తీసుకుందాం అని అటు రోషన్, ఇటు శ్రీకాంత్ ఇద్దరు కూడా చాలా రకాలు గా చర్చలు చేస్తున్నట్టు గా తెలుస్తుంది నిజానికి రోషన్ చూడటానికి హీరో లా చాలా బాగుంటాడు అందుకే ఆయనకి ముందు గా లవ్ స్టోరీస్( Love Stories ) చేసి సినిమాల్లో ఇమేజ్ తెచ్చుకోవడం బెటర్ అని చాలా మంది శ్రీకాంత్ కి సలహాలు ఇస్తున్నారట…ఇక ఇది ఇలా ఉంటె ఇప్పటికే రోషన్ కోసం చాలా మంది డైరెక్టర్లు శ్రీకాంత్ కి కథలు కూడా వినిపిస్తున్నారట అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళందరూ చెప్పిన కథల్లో రోషన్ ఇమేజ్ కి తగ్గ కథ ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు అని శ్రీకాంత్ అనుకుంటున్నట్లు గా తెలుస్తుంది.
ప్రస్తుతం హీరో గా శ్రీకాంత్ కెరియర్ ముగిసి పోయిన సంగతి మనకు తెలిసిందే అందుకే ఆయన ఇప్పుడు విలన్ గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు.ఇక ఇండస్ట్రీ లో ఎంతమంది హీరో లు ఉన్నప్పటికీ మనం చేసే సినిమాలు గాని మనం ఎంచుకున్న స్టోరీస్( Movie Story ) గాని బాగుంటే సినిమా హిట్లు వాటంతట అవే వస్తాయి అని అందరు చెప్పుకునే విషయమే…అందుకే ఇప్పుడున్న యంగ్ హీరోలు అందరు కూడా స్క్రిప్ట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది…
.