స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Star Director Rajamouli ) ఆర్ఆర్ఆర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ఈ సినిమాతో విజయం సాధించారు.ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన అభినయం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.
రాజమౌళి జపాన్ లో అభిమానులతో ముచ్చటిస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ( RRR ) గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ మూవీలో జెన్నీ పాత్రను చంపేయాలని మొదట అనుకున్నామని వెల్లడించారు.
భీమ్ కు జెన్నీ( Jenny Role ) సహాయం చేసే నేపథ్యంలో ఆమె మరణించేలా స్క్రీన్ ప్లే సిద్ధం చేశామని రాజమౌళి పేర్కొన్నారు.ఎమోషనల్ ఎండింగ్ వద్దని భావించి తర్వాత ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గామని జక్కన్న చెప్పుకొచ్చారు.

జక్కన్న ఆ పాత్రను చంపేసి ఉంటే మాత్రం సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుని ఉండేది కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్( RRR Sequel ) కూడా ఉండొచ్చని రాజమౌళి చెబుతున్నారు.జక్కన్న వేగంగా సినిమాలను తెరకెక్కిస్తే మాత్రం మరిన్ని సినిమాలకు సులువుగా సీక్వెల్స్ తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉంటుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ సినిమాను జక్కన్న పూర్తి చేయడానికి మరో మూడేళ్ల సమయం పడుతుంది.
ఆ తర్వాత రాజమౌళి ఈ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.

రాజమౌళి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవడం మరో డైరెక్టర్ కు సాధ్యం కాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాజమౌళి ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్( Rajamouli Remuneration ) తో పాటు లాభాల్లో వాటా అందుకుంటున్నారు.నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్న రాజమౌళికి భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పూర్తైన తర్వాతే ఆర్.ఆర్.ఆర్2 తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.