స్పైడర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోమ్ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జులై 26న మీ జీ తెలుగులో

స్పైడర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోమ్ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జులై 26న మీ జీ తెలుగులో ప్రతీ మనిషిలో ఒక హీరో ఉంటాడు, సందర్భం వచ్చినప్పుడు ఆ హీరో బయటకు వస్తాడు.అలాంటి ఒక సూపర్ హీరో స్పైడర్ మ్యాన్.

 Spiderman Far From Home On Zee Telugu On July 26,spiderman,latest Telugu News Sp-TeluguStop.com

చిన్నపటి నుంచి ఎన్నో స్పైడర్ మ్యాన్ చిత్రాలు చూసాము కానీ ఈసారి మనముందుకు రాబోతుంది ఒక వీరుడు మరియు అవెంజర్స్ యొక్క ధైర్యాన్ని పుణికిపుచ్చుకున్న ఒక యోధుడి కథ – ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్’.మనకి ఎంతో ఇష్టమైన జీ తెలుగు ఛానల్ ఈ ఆదివారం జులై 26 సాయంత్రం 6: 30 గంటలకు ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్’ సినిమాను తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారంచేయబోతుంది.
పీటర్ పార్కర్ (టామ్ హాలండ్), అవెంజర్స్ ఎండ్ గేమ్ లో తన గురువు టోనీ స్టార్క్ (రాబర్ట్ డౌనీ జూనియర్) కోల్పోయిన బాధలో నుండి బయటికి రాలేదు.తన వల్లనే టోనీ చనిపోయాడని భావిస్తాడు.

అందుకే కొన్ని రోజులు ఈ సూపర్ హీరో పనులకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తన స్కూల్ స్నేహితులతో కలిసి ఎడ్యుకేషన్ ట్రిప్ కి ఇటలీకి వెళతాడు.తాను ఏ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నాడో అవే బాధ్యతలు నిక్ (సామ్యూల్ ఎల్.జాక్సన్) కారణంగా మళ్లీ తనకు తారసపడతాయి.
జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పీటర్ పంచభూతాలతో పోరాడవలసి ఉంటుంది.నిక్ ఇచ్చే బాధ్యతలు పీటర్ సంపూర్ణగా నిర్వహించాడా? ఏ విధంగా తను పోరాడి గెలిచాడు తెలుసుకోవాలంటే స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ చూడాల్సిందే.

    అమోఘంమైన స్పైడర్ మ్యాన్ ధైర్య సాహసాలు మిస్ కాకుండా చూడండి.ఈ ఆదివారం జులై 26 సాయంత్రం 6: ౩౦ గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీ ఛానల్లలో…

  • మీ ఆప్తులుగా మేము కోరుకునేది ఒక్కటే, జాగ్రత్తగా ఉండండి.మేమందించే ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించండి.
  • ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
    మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

    నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

  • జీ తెలుగు గురించి
  • జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

    విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
    సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

    ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

    Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

    తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

    ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
    Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube