ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో వైలెన్స్ ఎక్కువ అయిపోతుంది.ఎంతో ప్రశాంతగా, అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లలో గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి.
మొన్నటికి మొన్న పెళ్లి జరిగిన రోజే ఓ యువకుడు భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు.మరో ఘటనలో పెళ్లి అనంతరం కేక్ కట్ చేసిన తర్వాత భర్తకు క్యూట్ గా కేక్ పెట్టాలి అని ఆ కొత్త పెళ్లికూతురు ట్రై చేస్తే అతి చేసిందని ఆ భర్త అక్కడే ఆమెను దారుణంగా కొట్టాడు.
సరే ఈ ఘటనల్లో అన్న పెళ్లి కూతురుని పెళ్లి కొడుకు కొట్టాడు.కానీ ఇక్కడ పెళ్లి కూతురును పెళ్లి కొడుకు తమ్ముడు అతి దారుణంగా కొట్టాడు.అదే ఏం అంటే సంప్రదాయం అంటున్నారు.ఇంకా ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది బయటకు రాలేదు కానీ దానికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక పెళ్లిలో శాంతి గేమ్ అనే సంప్రదాయం ఉంటుంది.ఇంకా ఈ ఆటలో వధువుకు, వరుడి తమ్ముడు మధ్య పోటీ పెడతారు.నెమలి పించాలతో ఇద్దరు కొట్టుకోవాలి.ఈ ఆట అక్కడ సంప్రదాయం.
కానీ, ఆ వరుడు తమ్ముడు వధువు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అకస్మాత్తుగా వధువును నెమలి పించంతో చితకబాదడం మొదలుపెట్టాడు.దీంతో అక్కడున్న పెద్దలు అతడిని కూల్ చెయ్యగా కొందరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.