ఏపీలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు.పోలీస్ రిక్రూట్ మెంట్ లో మూడేళ్ల సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైసీపీ పాలనపై ఈనెల 25న గుడ్ గవర్నెన్స్ కార్యక్రమం జరుగనుందని ఆయన తెలిపారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ కు తెలంగాణలో వీఆర్ఎస్ ఇస్తారని సోమువీర్రాజు పేర్కొన్నారు.ఏపీ నుంచి తెలంగాణకు వలస వెళ్లిన బీసీలకు కేసీఆర్ రిజర్వేషన్ ఇవ్వరని చెప్పారు.
ఒక ప్రాంత వ్యక్తులను కించపరిచే బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా చెప్పుకునే అర్హత ఉందా అని ప్రశ్నించారు.