టాలీవుడ్ తీరు ఇకనైనా మారుతుందా ? ఏమో అది జరిగే పని కాదు.777 సినిమాల్లో నటించిన కైకాలకు అన్యాయం జరిగిందా అంటే అవును ఖచ్చితంగా జరిగింది.నాటి రోజుల్లో ఎస్వీ రంగారావు లాగ నటించే నటుడిగా కైకాల మంచి పేరు సంపాదించుకున్నారు.అలాగే ఆయనకు దక్కనట్టే ఎలాంటి అవార్డులు ఈయనకు దక్కలేదు.ఒక్క పద్మ కూడా వారించకపోవడానికి కారణాలు ఏంటో ఇచ్చే వారే చెప్పాలి.అసలు నటనలో ఎలాంటి బేసిక్స్ కూడా తెలియని వారికి ఎన్నో సత్కారాలు, అవార్డులు ఇస్తున్నారు.
200 మంది దర్శకులతో ఏడూ వందలకు పైగా సినిమాల్లో నటించిన కైకాల కి ఒక్క 2017 లో ఫిలిం ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం మినహా ఏం దక్కింది.ఆ మధ్య ఆనారోగ్యం తో ఉంటె చిరంజీవి తప్ప ఎవరు వెళ్లి కలిసిన దాఖలాలు కూడా లేవు.
జూనియర్ ఆర్టిస్ట్ గా, ఎన్టీఆర్ కి డూప్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో గా, విలన్ గా అయన చేయని పాత్రా లేదు.చివరికి తనదైన టైమింగ్ తో మంచి కామెడీ రోల్స్ కుడా చేసాడు.
యముడు అంటే అప్పటికి, ఇప్పటికి ఎప్పటికైనా కూడా కేవలం కైకాల మాత్రమే.

అంత సీరియస్ గా యముడు పాత్రా వేస్తే అందులో కూడా కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు.సంపూర్ణ నటుడిగా, నట సర్వ భౌముడిగా పేరు గడించిన కైకాల రాజకీయాల్లో ఒక చెయ్యి వేసాడు.కానీ అతడికి రాజకీయాలు నప్పవు అని త్వరగానే తెలుసుకున్నాడు.
చాల మంది లాగ పైరవీలు చేత గాక నిన్నటి తరం పద్మ అవార్డులకు దూరం అయ్యారనే వాదన మరోమారు నిజం అని చెప్పక తప్పదు.కేవలం కులం ఆధారంగా కూడా కొన్ని అవార్డులు వరిస్తాయి.

అందుకే అన్య కులం లో పుట్టిన కైకాలను ఏది వరించలేదు.ఇప్పుడు చిరంజీవి కి ఇచ్చాక కొంత మారిన మొదటి నుంచి ఆ ఒక్క కులం మాత్రమే సినిమా ఇండస్ట్రీ ని ఏలింది.వారే స్టూడియోలు, సినిమా హాళ్లు, వాళ్లే హీరోలు, నిర్మాతలు.వారు చెప్పిందే శాశనం, గీసిందే గీత.ఇక కైకాల తన కెరీర్ మొత్తం మీద 777 సినిమాల్లో నటిస్తే అందులో 51 జానపదాలు, 28 పౌరాణికాలు, 200 సాంఘీక సినిమాలు, 9 చారిత్రక చిత్రాలు ఉన్నాయ్.ఇక అయిపోయిందేదో అయిపోయింది.
కనీసం గౌరవంగా వీడ్కోలు అయినా పలకండి.







