యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”స్కంద’‘( Skanda ).బోయపాటి అంటేనే ఫుల్ ఊర మాస్.
మరి అలాంటి బోయపాటితో రామ్ సినిమా అంటే థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం.ఇక ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు డబుల్ చేసాయి.
ఇటీవలే వచ్చిన ట్రైలర్ అంచనాలు పీక్స్ కు చేరుకునేలా చేసింది. ట్రైలర్ తో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని నిరూపించిన ఈ సినిమా కోసం యాక్షన్ లవర్స్ అంతా ఎదురు చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల ( Sreeleela )హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ సినిమా హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
మరి ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన సాంగ్స్ అలరించగా ఇప్పుడు మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ”డుమ్మారే డుమ్మా” అంటూ సాగే ఈ సాంగ్ మంచి పల్లెటూరి నేపథ్యంలో ప్రకృతి మధ్య చాలా ప్లజెంట్ గా శ్రోతలను విశేషంగా ఆకట్టు కుంటుంది.ఈ సాంగ్ ను అన్ని భాషల్లో రిలీజ్ చేసారు.
థమన్ అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది.
మరి అఖండ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి రామ్ కు కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.