ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సిట్ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయనుంది.
అదేవిధంగా దీనిపై న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.డివిజన్ బెంచ్ లో సిట్ బృందం రిట్ అప్పీల్ పిటిషన్ వేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని బీజేపీ నేతలతో పాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.
కేసు విచారణను సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.