2022 ఏడాది మరొక వారం రోజుల్లో పూర్తి కాబోతుంది.కొత్త ఏడాదిని గ్రాండ్ గా ఆహ్వానించడం కోసం అంతా రెడీ అవుతున్నారు.
మరి ఈ ఏడాదిలో కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయ్యాయి.ప్రతీ వారం కూడా కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ కు కొత్త వెలుగు తీసుకు వచ్చాయి.2022 సౌత్ సినిమాలు బాలీవుడ్ ను సైతం బీట్ చేసి బెంబేలెత్తించాయి.దక్షిణాది సినీ పరిశ్రమ బాలీవుడ్ ను మించి కలెక్షన్స్ సాధించాయి.అలాగే కంటెంట్ పరంగా కూడా బాలీవుడ్ మీద ఆధిపత్యం సాధించాయి.మరి మన సౌత్ లో ఐదు కొత్త ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి.ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2022 లో రాజమౌళి మన టాలీవుడ్ కు మరొక బ్లాక్ బస్టర్ సినిమాను అందించాడు.ట్రిపుల్ ఆర్ వంటి సినిమాను తెరకెక్కించి అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను తీసుకుని అతిపెద్ద మల్టీ స్టారర్ గా రూపుదిద్దాడు.
ఈ సినిమాలో తెలుగులో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ బద్దలు కొట్టింది.ఇక కేజిఎఫ్ 2 కూడా ఈ ఏడాది లోనే రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా యష్ హీరోగా నటించాడు.కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ సినిమా 1000 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.ఇక మరో కన్నడ సినిమా కాంతారా.రిషబ్ శెట్టి దర్శకత్వంలో హీరోగా కూడా నటించిన కాంతారా సినిమా ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి.చిన్న సినిమా వందల కోట్లు వసూళ్లు చేసింది.ఇక కోలీవుడ్ నుండి విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్స్ రెండు వచ్చాయి.
కమల్ హాసన్ విక్రమ్ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది.అలాగే పొన్నియన్ సెల్వన్ తమిళ్ ప్రేక్షకులను గర్వంగా తలెత్తుకునేలా చేసింది.
ఇక వీటితో పాటు మన సౌత్ నుండి మరిన్ని సినిమాలు వచ్చే ఏడాది కూడా వరుసగా రాబోతున్నాయి.చూడాలి 2023 లో కూడా సౌత్ బాలీవుడ్ పై పైచేయి సాధిస్తుందో లేదో.