తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ కౌసల్య (Singer Kausalya)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో ఎన్నో మంచి మంచి పాటలు పాడి సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది కౌసల్య .1999తో నీకోసం సినిమాతో సింగర్(Singer) గా పాటలను మొదలుపెట్టి తన సినీ కెరియర్లో దాదాపుగా 350 కి పైగా పాటలు పాడింది.ఇది ఇలా ఉంటే పైకి నవ్వుతూ కనిపించే ప్రతి ఒక సెలబ్రిటీ వెనుక కెరియర్ పరంగా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఏడుపులు దాగుంటాయి అన్నట్టు సింగర్ కౌసల్య వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.
ఇకపోతే గతంలో పలుసార్లు ఆమెను తన భర్త వేధిస్తున్నాడు అంటూ కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.తాజాగా ఆమె ఇదే విషయం పై ఒక ఇంటర్వ్యూలో స్పందించింది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా కౌసల్య మాట్లాడుతూ.భర్త వేధించిన తన కుమారుడి కోసం అతడితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని, కానీ చివరికీ తన భర్తే తనను వదిలేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని అని ఆమె తెలిపింది.
ప్రస్తుతం తన కుమారుడు ఎదిగాడని, ఇప్పుడు అతడెంతో ప్రేమగా చూసుకుంటున్నాడని కౌశల్య తెలిపారు.అదేవిధంగా ఓ మంచి వ్యక్తిని రెండో వివాహం చేసుకోవాలని కుమారుడు(son) సూచించినట్లు చెప్పారు.
ఇప్పటి వరకు తనను కష్టపడి పెంచిందీ చాలు, ఒంటరిగా ఉండొద్దు, నిన్ను బాగా చూసుకునే వాడు రావాలి అని కుమారుడు కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది.
తనకు తల్లిదండ్రులు లేరని, వారి ప్రేమను సరిగ్గా చూడలేదని, కానీ తన కుమారుడి ప్రేమను చవి చూస్తున్నట్లు తెలిపారు.అనంతరం తన భర్త గురించి స్పందిస్తూ.తన భర్త తీవ్రంగా కొట్టేవాడని,కొట్టడం సమస్యకు పరిష్కారం కాదని, సమస్యను కూర్చుని మాట్లాడాలని, సమస్య ఇదని చెబితే అర్థం చేసుకునేదాన్నని అని తెలిపింది కౌసల్య.
తన చెల్లి పెళ్లి తరువాత తనను బాగా చూసుకుంటానని చెప్పాడని కానీ అతడు మారలేదని, కొడుకు కార్తీకేయ కడుపులో ఉన్న సమయంలో కూడా హింసించినట్లు ఆమె తెలిపింది.