సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )కు ఈ జనరేషన్ లో సైతం కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.నటుడిగా సంచలన విజయాలను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తన సినిమాలలో కొన్ని సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు.
ఈ జనరేషన్ నటులలో ఎంతోమంది నటన విషయంలో సీనియర్ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుంటారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతున్నాయి.
ఇప్పుడు తెలుగు సినిమా ఏదైనా చైనాలో( China ) విడుదలైతే అందరూ ఆశ్చర్యంగా ఫీలవుతారు.అయితే 1950వ దశకంలోనే తెలుగు సినిమా చైనాలో విడుదలైంది.చైనాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో మల్లీశ్వరి( Mallishwari ) అనే సినిమాను ప్రదర్శించడం జరిగింది.ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో భానుమతి( Bhanumati ) నటించడం గమనార్హం.
ఈ సినిమాకు బీఎన్ రెడ్డి నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించారు.హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కింది.
లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కగా ఎన్టీఆర్ నాగరాజు పాత్రలో నటించి మెప్పిస్తే భానుమతి మల్లీశ్వరి పాత్రకు ప్రాణం పోశారు.భారతీయ సినీ చరిత్రలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.1951 సంవత్సరం డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.మొదట ఈ సినిమాకు పెద్దగా టాక్ రాకపోయినా తర్వాత ఈ సినిమా పుంజుకుని రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ సినిమాను సెకండ్ టైమ్ రిలీజ్ చేయగా సెకండ్ టైమ్ ఈ సినిమా ఫస్ట్ టైమ్ ను మించి సక్సెస్ సాధించింది.1953 సంవత్సరం మార్చి 14వ తేదీన ఈ సినిమా చైనా భాషలోకి డబ్ అయింది.ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాను డబ్ చేయాలని భావించినా బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమాను ఇంగ్లీష్ లోకి డబ్ చేయలేదు.