ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) లో తక్కువగా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శివాజీ ( Shivaji )అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈయన ఎక్కువగా ఆట మీదకంటే కూడా కెప్టెన్సీ చెయ్యడం లోనే శ్రద్ద వహిస్తున్నాడు.
ఒకేఒక్కసారి ఫిజికల్ టాస్క్ లో బలంగా ఆడదానికి ప్రయత్నం చేసాడు.ఆ ప్రయత్నం లోనే అతని భుజానికి బలమైన గాయం అయ్యింది.
అప్పటి నుండి పూర్తిగా గేమ్ ఆడడం ఆపేసి, కేవలం సంచాలక్, లేదా కెప్టెన్సీ మాత్రమే చేస్తూ వచ్చాడు.ఈ ఇచ్చిన సూచనలతో ఒకటి రెండు గేమ్స్ గెలిచారు కానీ, హౌస్ లో తనకంటే కస్టపడి ప్రతీ ఒక్కరు ఆడుతున్నారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఇదే విషయాన్నీ ఈ వారం నామినేషన్స్ లో గౌతమ్ ఒకసారి అంటాడు.మీకు దెబ్బ తగిలి ఆడలేకపోతున్నారు.
మీరు ఒకవేళ హౌస్ నుండి వెళ్ళిపోతే, కుర్రాళ్లలో ఎవరికో ఒకరికి అవకాశం వస్తుంది కదా అని అంటాడు.
అందుకు శివాజీ తెగ హర్ట్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈరోజు జరగబోయే కెప్టెన్సీ టాస్కులో ఒకరిని ఓట్ల పద్దతి తో కెప్టెన్సీ టాస్కు నుండి పక్కకి తప్పించే ఛాన్స్ ఇస్తాడు.అప్పుడు అమర్ దీప్( Amar Deep ) శివాజీ ని ఈ కెప్టెన్సీ టాస్కు నుండి తొలగిస్తాడు.
మీరు సరిగా ఆడలేకపోతున్నారు, మీకంటే కష్టపడినా వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు.వారిలో ఎవరికో కెప్టెన్సీ రావడం మంచిది, అందుకే మిమల్ని తప్పిస్తున్నాను అంటూ శివాజీ ని తప్పించాడు.
దీనికి శివాజీ నేను ఆడడం లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు, నేను కస్టపడి ఆడబట్టే కదా ఈరోజు నాకు ఈ దెబ్బ తగిలింది.ఆడడం లేదని ఎలా చెప్తావు అని అంటాడు.
అప్పుడు అమర్ దీప్ మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే మీరు తక్కువ అనిపించారు, అందుకే అలా చేశాను అన్నా నన్ను క్షమించండి అని అంటాడు.
దీనికి శివాజీ బాగా హర్ట్ అవుతాడు, బిగ్ బాస్ అతన్ని కన్ఫెషన్ రూమ్ కి లోకి పిలుస్తాడు.ఇప్పుడు మీ చెయ్యి ఎలా ఉంది అని శివాజీ ని అడగగా, ఏమి బాగాలేదు బిగ్ బాస్, చెయ్యి చాలా లాగేస్తుంది, గేమ్స్ ఆడలేకపోతున్నాను, ఇందాక అతను నన్ను ఏమి ఆడడం లేదు అనడం చాలా బాధ అనిపించింది అంటూ ఏడవడం ప్రారంభిస్తాడు.దీనిని చూసి ప్రేక్షకులు ఇప్పటి వరకు అమర్ దీప్ ని శివాజీ ఎన్నో విధాలుగా హర్ట్ చేసాడు.
అమర్ సీరియస్ గా తీసుకోకుండా కామెడీ గానే తీసుకున్నాడు.ప్రతీ వారం శివాజీ అమర్ దీప్ ని నామినేట్ చేస్తూనే ఉన్నాడు.ఒక వ్యక్తి మీద ఇంత టార్గెట్ చేసి, మళ్ళీ అదే వ్యక్తి ఉన్న నిజాలు చెప్తే ఎందుకు అంత బాధ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.