తమిళ స్టార్ హీరో సూర్య నటించే ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు.తమిళంలో ఆయన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ఇక్కడ కూడా ఆయన సినిమాలు అంతే స్థాయిలో ఆడుతుంటాయి.
కాగా సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సూర్య ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే క్రమంలో సూర్య పాత్రకు ఓ విలక్షణ నటుడు తన వాయిస్‌ను అందిస్తున్నాడు.టాలీవుడ్లో తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పి్స్తున్న సత్యదేవ్, ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాలో నటించి సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సె్స్ కావడంతో సత్యదేవ్ నటనకు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు.కాగా సూర్య నటిస్తున్న ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
అయితే ఈ సినిమాలో సూర్య పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమాను 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో డా.ఎం.మోహన్ బాబు, పరేష్ రావల్, ఊర్వశి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.