విమానం మూవీ రివ్యూ...

హృద‌యాన్ని తాకే భావోద్వేగాల వ్య‌క్తుల ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే సినిమా విమానం…( Vimanam Movie ) మంచి కాన్సెప్ట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ గా నేడు తెలుగు , తమిళ భాషల్లో విడుదలైంది.జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై కిర‌ణ్‌ కొర్ర‌పాటి నిర్మించిన సినిమాకు శివ ప్ర‌సాద్ యానాల దర్శకత్వం వహించాఋ.

 Samuthirakani Anasuya Meera Jasmine Vimanam Movie Review Details, Vimanam Review-TeluguStop.com

తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని( Samuthirakani ) కీలక పాత్రల్లో నటించారు.మాస్ట‌ర్ ధ్రువ‌న్‌,( Master Dhruvan ) అనసూయ,( Anasuya ) రాహుల్ రామ‌కృష్ణ‌,( Rahul Ramakrishna ) ధ‌న్‌రాజ్‌, మీరా జాస్మిన్, తమిళ నటుడు మొట్ట రాజేంద్ర‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, పోస్టర్‌లు సినిమాపై పాజిటీవ్‌ బజ్‌నే క్రియేట్ చేశాయి.

ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా ఉందొ లేదో రివ్యూ లో చూద్దాం .

 Samuthirakani Anasuya Meera Jasmine Vimanam Movie Review Details, Vimanam Review-TeluguStop.com

ముందుగా కథ విషయానికి వస్తే … విమానం’లో సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ తండ్రీ కుమారులుగా నటించారు.ఆ ఇద్దరి ప్రయాణమే ఈ సినిమా కథ.ఇక బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.వీరికి పూటా గడవటమే చాలా కష్టం .ఇక పూట గ‌డిస్తే చాల‌నుకునే చాలీ చాల‌ని సంపాద‌తో బతుకు ఇడుస్తుంటాడు .అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉన్న పిల్లాడుకి విమానం అంటే చాలా ఇష్టం.ఎపుడు ఆకాశం వైపు చూస్తూ , కనిపించే విమానాలను కన్నరపకుండా చూస్తుంటాడు.

ఆ పిల్లాడికి విమానం ఎక్కాల‌నే కోరిక కలుగుతుంది.అయితే తండ్రి అవిటిత‌నంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ కొడుకు కోరిక‌ను ఎలాగైనా తీర్చాలని ప‌గ‌లు రాత్రి తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతుంటాడు.

ఇక విమానం ఎక్కాల‌నుకునే కొడుకు కోరిక‌ను తీర్చటానికి ఏం చేయలని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు.ఇది తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఒక ఎమోష‌న్‌…మరోవైపు వేశ్య ఐన సుమ‌తీ పాత్రలో అనసూయ నటించింది.

సుమతి అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు కోటి.ఇక లోక‌మంతా ఆమెను కామంతోనే చూస్తుంద‌ని బావిస్తుంటుంది.సరిగ్గా అదే సమయంలో ఆమెను కూడా మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడ‌ని తెలియ‌గానే ఆమె హృద‌యంలో నుంచి వచ్చే ఆవేద‌న‌.రెండు హృద‌యాల మ‌ధ్య సాగే మరో ఎమోష‌న్‌.

మొత్తముగా ముందుగా మనం చెప్పుకున్నట్లు హృదయానికి కన్నీళ్లను తెప్పించే సినిమా విమానం.కొడుకు కోరికను తీర్చడానికి తండ్రి ఎం చేసాడు? చివరకి ఆ పిల్లాడికి కోరిక తీరిందా? విమానం ఎక్కాడా? అనేదే అసలు కథ .

Telugu Dhanraj, Master Dhruvan, Meera Jasmine, Samuthirakani, Vimanam Review, Vi

ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే .తండ్రి , కొడుకుల మధ్య సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంటి.తండ్రీ కుమారుల మధ్య సంభాషణలు, కుమారుడి మాటల్లో ఏమీ తెలియని అమాయకత్వం, స్వచ్ఛత ఎక్కువగా ఆకట్టుకుంటాయి.పిల్లాడి ఆశ నెరవేర్చడం కోసం అవటివాడైన తండ్రి పడే కష్టం కన్నీళ్లను తెప్పిస్తాయి.

సినిమా చూస్తున్న సేపు ప్రేక్షకుని గుండె బరువెక్కాలిసిన్దే.కళ్లలో కన్నీటికి కూడా ఆపుకోలేమని సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి.

ఇక నాన్నా… అమ్మ దేవుడి దగ్గరకు వెళ్లిందని చెప్పావ్ కదా! విమానం ఎక్కి దేవుడి దగ్గరకు వెళ్ళిందా?’ అని కుమారుడు అడగ గానే ‘అవును రా’ అంటూ తండ్రి చెప్పడం ఇక వెంటనే ఇంకో ఆలోచన సైతం లేకుండా ‘అమ్మ ఎంత గ్రేట్ నాన్నా’ అని కొడుకు అంటాడు.తండ్రి మాటలను అంతలా నమ్మేసే అమాయకత్వం ఆ చిన్నారిది.

Telugu Dhanraj, Master Dhruvan, Meera Jasmine, Samuthirakani, Vimanam Review, Vi

అప్పటి నుంచి విమానం ఎక్కించమని తండ్రిని అడుగుతూ ఉంటె బాగా చదువుకుని, పెద్దోడు అయ్యాక నువ్వే ఎక్కొచ్చు అని తండ్రి చెప్పడం లాంటి డైలగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.అలాగే పిల్లల మధ్య విమానం గూర్చి సాగే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.‘బస్సు , లారీ నడిపే వాడినీ డ్రైవర్ అంటారని చెప్పుకోడం .ఇక విమానం నడిపే వాడిని పైలెట్ అనదానికి కారణం పైకి వెళ్ళాక లైట్ వేసుకుంటాడు కాబట్టి పైలట్ అంటారని సాగే సీన్స్ చాల బాగున్నాయి.అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి దేవునికి దణ్ణం పెట్టాలని తండ్రి అంటే .అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్నా అంటారు అని పిల్లడు చెప్పిన మాటలు హృదయాన్ని కదిలిస్తాయి.తండ్రి కొడుకుల ప్రేమ, సెంటిమెంటు, వాళ్ళ ఆశలు, కష్టాలు వీటితో సమ్మేళనంగా తీసిన సినిమాగా విమానమని చెప్పవచ్చు.

Telugu Dhanraj, Master Dhruvan, Meera Jasmine, Samuthirakani, Vimanam Review, Vi

నటీనటుల విషయానికి వస్తే .వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ అద్భుతంగా నటించారు.మీరాజాస్మిన్ ఈ సినిమాతో తిరిగి సినిమాలకి రే ఎంట్రీ ఇచ్చింది.

మీరాజాస్మిన్ కి డీసెంట్ రోల్ లో చాలా బాగా నటించి మెప్పించింది.అనసూయకి నటించడానికి వీలైనతన మంచి రోల్ దొరికింది.

సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ చాలా బాగా నటించింది.రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో నటించి మెప్పించారు.

సాంకేతిక విషయానికి వస్తే .శివ ప్ర‌సాద్ యానాల ఎమోషన్ డ్రామాని ప్రేక్షకుల హృదయాన్ని తాకేలా సినిమాను అందించడములో సక్సెస్ అయ్యేరు.ప్రతి సన్నివేశం మనసుకి హత్తుకునేలా .కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చేలా సినిమాను అందించారు.ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ సినిమాకి తప్పకుండా ప్రేక్షకులు ఫిదా అవుతారు అనడంలో అతిశ్రేయోక్తి లేదు.జీ స్టూడియోస్ , కిరణ్‌ కొర్రపాటి నిర్మాణ విలువలు బాగున్నాయి.

సినిమాకు అవసరమున్నంత వరకు పెట్టాల్సినవి పెట్టారు.వివేక్ కాలేపు సినిమాటోగ్ర‌పీ బాగుంది.

చ‌ర‌ణ్ అర్జున్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది.హ‌ను రావూరి డైలాగ్స్ టచింగా ఉన్నాయి.

మార్తాండ్ కె.వెంక‌టేష్‌ ఎడిటింగ్ ఒకే అనిపిస్తుంది.ఓవరాల్ గా సినిమా గూర్చి చెప్పాలంటే ప్రతి ప్రేక్షకుడు బరువెక్కిన హృదయంతో థియేటర్స్ నుంచి బయటకు వస్తారు.అంతలా సినిమా హృదయాన్ని తాకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube