సమంత,( Samantha ) నాగచైతన్య.( Naga Chaitanya ) ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి ఈ జంట పేర్లు మారమవుతున్నాయి.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.ఈ జంట విడాకులు టాలీవుడ్ లో సెన్సేషన్ ను సృష్టించింది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి చర్చించుకున్నారు.ఈ జంట విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయి రెండేళ్ల పైనే అవుతున్నా కూడా ఇప్పటికీ వీరు మళ్ళీ కలిసి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
దీంతో వీరి విషయం గురించి అభిమానులు ప్రస్తావించి అలసిపోయారు.
విడాకుల విషయాన్ని చాలామంది మర్చిపోయారు.సమంత, నాగచైతన్య కూడా ఎవరి ప్రాజెక్ట్స్‌లో వారు బిజీగా ఉన్నారు.అంతేకాకుండా ఇద్దరికీ ఒకే విధంగా ఫ్లాపులు కూడా ఎదురవుతున్నాయి.
అదే సమయంలో విజయ్ దేవరకొండతో సమంత కలిసి నటించిన ఖుషి మూవీ( Kushi Movie ) మంచి హిట్‌ను అందుకుంది.కలెక్షన్స్ విషయంలో కూడా పరవాలేదనిపించింది.నాగచైతన్య మాత్రం ఇంకా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇదే సమయంలో సమంత ఇన్‌స్టా పేజీలో మళ్లీ పెళ్లి ఫోటోలు, నాగచైతన్యతో హాలిడేలకు వెళ్లిన ఫోటోలు ప్రత్యక్షమవ్వడంతో అసలు దీనికి అర్థమేంటి అని ప్రేక్షకులు సందేహంలో పడ్డారు.
ఎందుకంటే, విడాకుల తర్వాత సామ్ వాటిని డిలీట్ చేసింది.బయటకు కనిపించకుండా Archiveలో పెట్టింది.అవి మళ్లీ ఇన్‌స్టాలోకి( Instagram ) రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సమ్‌థింగ్ ఫిషీ అంటున్నారు.
దీంతో చాలామంది సమంత నాగచైతన్య మళ్ళీ ఒకటి కాబోతున్నారు మళ్లీ ఇద్దరు కలవబోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే కొంతమంది ఈ ఫొటోస్ పై స్పందిస్తూ మీ పిచ్చి కాకపోతే విడాకులు తీసుకున్న తర్వాత కనీసం ఒకరికొకరు బర్త్డే విషెస్ కూడా చెప్పుకొని వారు మళ్ళీ ఎలా కలుస్తారని అనుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి సమంత నాగచైతన్యల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.ఈ విషయంపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.