ఈమధ్య మన సౌత్ ఇండియన్ హీరోయిన్స్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టి హద్దులు దాటి రొమాన్స్ చేస్తూ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం ఇష్టం చూపని తమన్నా రీసెంట్ గా బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో ఏకంగా బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించడం మనమంతా చూసాము.
సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈమెనే కనిపించేది.ఈమె తర్వాత ఇప్పుడు రష్మిక మందన ( Rashmika Mandanna )కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ హిందీ చిత్రం ‘ఎనిమల్’.( Animal ) రణబీర్ కపూర్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు మొదటి పాట రీసెంట్ గానే విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా పాటలో రష్మిక రణబీర్ కపూర్ ( Ranbir kapoor )కి లిప్ కిస్ లు ఇవ్వడం సెన్సేషనల్ గా మారింది.ఎదో ఒక చోట అంటే పర్లేదు, పాట లిప్ లాక్స్ తప్ప మరొకటి లేదు.మూడు నిమిషాల సాంగ్ లోనే ఈ రేంజ్ అంటే, ఇక సినిమాలో ఏ రేంజ్ ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు.
అయితే ఈ పాత్ర తొలుత రష్మిక కి కాదు, సమంత కి వచ్చిందట.ఆమెకి సినిమా స్టోరీ బాగా నచ్చింది కానీ, ఇలా అడుగడుగునా రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడం అంటే నా వల్ల కాదు, మిగతా హీరోయిన్స్ లాగ నేను చెయ్యలేను అంటూ సందీప్ కి చెప్పి పంపేసిందట.
దీంతో విజయ్ దేవరకొండ సలహా మేరకు సందీప్ రెడ్డి వంగ రష్మిక ని తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు.అలా సమంత వదిలేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ రష్మిక చేతికి వెళ్ళింది.
సమంత( Samantha ) గతం లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో మెయిన్ విలన్ రోల్ పోషించిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఇందులో ఆమె చూపించిన విలనిజం కి మంచి మార్కులే పడ్డాయి.కానీ ఈ సిరీస్ లో ఆమె చేసిన కొన్ని హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ఆమె ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది.ఈ సన్నివేశాల వల్ల ఆమె చాలా నెగటివిటీ ని ఎదురుకోవాల్సి వచ్చింది.
నాగ చైతన్య తో ఆమె విడాకులు జరగడానికి కూడా కారణం ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్త.మళ్ళీ అలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి నెగటివిటీ ని మూటగట్టుకోదల్చుకోలేదు అంటూ సందీప్ కి సున్నితంగా చెప్పి వెనక్కి పంపేసిందట.