సొంతింటిని అద్దెకిచ్చిన సల్మాన్ ఖాన్.. నెలకెంతో తెలిస్తే?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు.

 Salman Khan Rents Out His Flat Bandra Apartment, Salman Khan, Bollywood, Flat Re-TeluguStop.com

ఇక హీరో అంటే తనకు ఆస్తిపాస్తులు ఎన్ని ఉంటాయో అందరికి తెలిసిందే.అలా సల్మాన్ ఖాన్ కూడా ఎన్నో ఆస్తులను కూడపెట్టాడు.

అందులో ముంబైలోని తన ఆస్తులలో ఒకటైన తన ఫ్లాట్ ను అద్దెకు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.బాంద్రా వెస్ట్ లోని శివ్ ఆస్థాన్ హైట్స్ లో నెలకు దాదాపుగా 95 వేల చొప్పున సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్ ను అద్దెకు ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

బాంద్రా బ్యాండ్ స్టాండ్ కు సమీపంలోనే ఉన్న గెలాక్సీ అపార్ట్మెంట్ లోని 14 వ అంతస్తులో 758 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ప్రస్తుతం ఈ ఫ్లాట్ ను 33 నెలలకు గాను అద్దెకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఒప్పందం డిసెంబర్ 6న జరిగినట్లు సమాచారం.ఒప్పందానికి సంబంధించిన పత్రాలను Zapkey.Com వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు మనీకంట్రోల్ తెలిపింది.ఇకపోతే ఈ ఒప్పందంలో 5% ఎస్కలేషన్ నిబంధన ప్రకారం అద్దెదారు 2.85 లక్షలు డిపాజిట్ చెల్లించాడట.

Telugu Bandra, Bollywood, Flat, Salman Khan, Salmankhan-Movie

ఇవే కాకుండా సల్మాన్ ఖాన్ కు ముంబై పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆస్తులు ఉన్నాయి.సల్మాన్ ఖాన్ బాంద్రాలో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకు దాదాపుగా 8.25 లక్షల ధర డూప్లెక్స్ ఫ్లాట్ ను అద్దెకు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.అలాగే మక్బ హైట్స్ లోని 17, 18 వ అంతస్తులో ఉన్న ఈ ప్లాట్ ను బాబా సిద్దిక్ జీషన్ సిద్దిక్ లు కొనుగోలు చేసినట్లు ఆ పత్రాల్లో ఉందని తెలుస్తోంది.ఈ సంవత్సరం ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఒప్పందాన్ని పునరుద్ధరించాడట.

అలాగే సల్మాన్ ఖాన్ కు నగర శివారు అయినా పన్వెల్ లో ఒక ఫామ్ హౌస్ ఉందని, మహేష్ మంజ్రేకర్ తెలిపాడు.ఈ మహేష్ మంజ్రేకర్ సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని ఒక వన్ బీహెచ్ కే ఇంట్లో నివసిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube