తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ గా తన కంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్( Powerstar Pawan Kalyan ) కెరియర్ మొదట్లో కొన్ని తప్పులు అయితే చేశాడు.అవి ఏంటి అంటే ఆయన సిమిలర్ టైప్ ఆఫ్ స్టోరీస్ ని ఎంచుకొని సినిమాలు చేశాడు.
దానివల్ల సినిమాలైతే సక్సెస్ అయ్యాయి.కానీ నటుడుగా ఆయనలో వైవిధ్యమైతే ఎక్కువగా కనిపించలేదు.
దానివల్ల ఆయన నటుడుగా సక్సెస్ అవుతాడా లేదా అని అందరిలో చాలా అభ్యంతరాలు అయితే వ్యక్తం అయ్యాయి.
ఇక మొత్తానికైతే తనను తాను రిప్రజెంట్ చేసుకుంటూ భారీ సక్సెస్ లను అందుకున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకు అంటే ఈయన కూడా పవన్ కళ్యాణ్ లాగే పెద్దగా వైవిధ్యమైతే లేని పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక రొటీన్ కథలతో వస్తున్నాడు.ఒక్క విరూపాక్ష సినిమా( Virupaksha Movie )ని మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా రొటీన్ ఫార్ములలో నడిచినవే కావడం విశేషం… ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇదే క్రమం లో ఆయన తీసిన ప్రతి సినిమాసూపర్ హిట్ సాధించాలి అంటే వైవిద్యమైన కథంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఆయన చేయబోయే సినిమాల మీద విపరీతమైన అంచనాలైతే నెలకొన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటాడా లేదా రొటీన్ ఫార్ములా కథలనే చేస్తూ డీలాపడిపోతాడా అనేది ఆయన నిర్ణయించుకోవాల్సిన అవకాశం అయితే వచ్చింది…ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న గాంజా శంకర్ సినిమా( Gaanja Shankar ) ఆగిపోయింది.ఇక మళ్ళీ తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశలైతే ఉన్నాయి…
.